logo

బోర్డు తిప్పేసిన నకిలీ వైద్యుడు

జిల్లా వైద్యఆరోగ్యశాఖ, తెలంగాణ వైద్యమండలి సభ్యులు హనుమకొండలో ఓ నకిలీ వైద్యుడిని గుర్తించారు.

Published : 28 Apr 2024 01:48 IST

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: జిల్లా వైద్యఆరోగ్యశాఖ, తెలంగాణ వైద్యమండలి సభ్యులు హనుమకొండలో ఓ నకిలీ వైద్యుడిని గుర్తించారు. చర్యలు తీసుకోవడానికి వెళ్లేలోపు.. అతడు బోర్డు తిప్పేశాడు. అధికారులు తెలిపిన ప్రకారం.. ఈ నెల 26న హనుమకొండలో తెలంగాణ వైద్యమండలి సభ్యులు, డీఎంహెచ్‌ఓ అధికారులు క్లినిక్‌లలో తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో హనుమకొండ ఎన్‌జీవో కాలనీ ఇందిరానగర్‌లో నకిలీ వైద్యుడు రంజిత్‌ క్లినిక్‌ బోర్డు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. వెంటనే నకిలీ వైద్యుడికి సంబంధించిన సమాచారాన్ని యాంటీ క్వాకరీ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. శనివారం హనుమకొండ జిల్లా వైద్యఆరోగ్యశాఖ అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మదన్‌మోహన్‌రావు, తెలంగాణ వైద్యమండలి సభ్యులు నకిలీ వైద్యుడిని పట్టుకునేందుకు వెళ్లగా.. అధికారుల రాకను గుర్తించిన నకిలీ వైద్యుడు క్లినిక్‌ బోర్డు తొలగించి షట్టర్‌కు తాళం వేసి పారిపోయాడు. అది చూసిన అధికారులు కంగుతిన్నారు. నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మదన్‌మోహన్‌రావు, వైద్యమండలి సభ్యులు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని