logo

ప్రజాస్వామ్యం ఓటుతోనే సాధ్యం

ప్రజాస్వామ్యమనేది ఓటు ద్వారానే సాధ్యమని, ఓటు హక్కును మన ప్రాథమిక బాధ్యతగా భావించి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు.

Published : 28 Apr 2024 01:46 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, చిత్రంలో అధికారులు

ములుగు, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్యమనేది ఓటు ద్వారానే సాధ్యమని, ఓటు హక్కును మన ప్రాథమిక బాధ్యతగా భావించి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో దివ్యాంగులు, వయోవృద్ధులతో జరిగిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. దివ్యాంగులు, వయోవృద్ధులు ఓటు హక్కును తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. వంద శాతం పోలింగ్‌ జరిగినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యంగా భావించాలన్నారు. ఓటు హక్కు వినియోగానికి వీలుగా పీడబ్ల్యుడీ ఓటర్లు మహిళలకు పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. దివ్యాంగులు, 85 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు, పోలింగ్‌ స్టేషన్‌ వరకు వెళ్లలేని వారి కోసం ఎన్నికల కమిషన్‌ ఇంటి నుంచే ఓటు వేసే విధంగా అవకాశం కల్పించిందని స్పష్టం చేశారు. ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత, స్వీప్‌ నోడల్‌ అధికారి శ్రీనివాస్‌ కుమార్‌, సీడీపీవోలు మళ్లీశ్వరి, స్వాతి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు