logo

తేలిన లెక్క.. అతివలే నిర్ణేతలు

వరంగల్‌(ఎస్సీ), మహబూబాబాద్‌(ఎస్టీ) లోక్‌సభ స్థానాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్ల లెక్క తేలింది.. ఫిబ్రవరి 8న తుది జాబితా ప్రకటించినా.. అర్హులైన వారు ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.

Published : 28 Apr 2024 01:57 IST

వరంగల్‌(ఎస్సీ), మహబూబాబాద్‌(ఎస్టీ) లోక్‌సభ స్థానాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్ల లెక్క తేలింది.. ఫిబ్రవరి 8న తుది జాబితా ప్రకటించినా.. అర్హులైన వారు ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ మేరకు శనివారం అనుబంధ జాబితా ప్రకటించారు. వీరంతా మే 13న జరిగే ఎన్నికల్లో ఓటు వేయవచ్చు.  ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాల్లోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 33,56,832 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు-16,43,257, మహిళలు-17,13,072, ఇతర ఓటర్లు 503 మంది ఉన్నారు.

ఈనాడు, మహబూబాబాద్‌-న్యూస్‌టుడే, వరంగల్‌ కలెక్టరేట్‌


ఆమె ఓటే శాసనం

వరంగల్‌, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లోని ఓటర్లలో నారీమణులదే పైచేయిగా ఉంది. 14 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ మగవారి కంటే ఆడవారే ఎక్కువగా ఉన్నారు. వరంగల్‌ పరిధిలో 8,95,421 పురుష ఓటర్లు ఉండగా 9,28,648 మహిళా ఓటర్లున్నారు. అంటే 33,227 మంది అతివలు ఎక్కువ.. మహబూబాబాద్‌ పరిధిలో 7,47,836 పురుష ఓటర్లు ఉండగా 7,84,424 మహిళా ఓటర్లున్నారు. వీరిలో 36,588 నారీమణులు అధికంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆమె ఓటే శాసనం కానుంది.

పెరిగిన ఓటర్లు

ఫిబ్రవరి 8న ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం వరంగల్‌ లోక్‌సభ స్థానంలో 18,16,609 మంది ఓటర్లు ఉండగా, అనుబంధ జాబితా ప్రకారం 18,24,466 మంది ఉన్నారు. అంటే 7,857 మంది ఓటర్లు పెరిగారు. మహబూబాబాద్‌ పరిధిలో 15,26,137 ఓటర్లుండగా అనుబంధ జాబితా ప్రకారం 15,32,366 మంది ఉన్నారు. 6229 మంది ఓటర్లు పెరిగారు. వీరిలోనూ వనితలే ఎక్కువగా ఉన్నారు.

  •  14 అసెంబ్లీ సెగ్మెంట్లలో థర్డ్‌జెండర్‌ ఓటర్లు 503 ఉండగా అత్యధికంగా వరంగల్‌ తూర్పులో 339 మంది ఉన్నారు. అత్యల్పంగా స్టేషన్‌ఘన్‌పూర్‌, పరకాలలో ఇద్దరు చొప్పున ఉన్నారు.
  •  14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 3,709 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. వరంగల్‌ పరిధిలో 1893 ఉండగా వాటికి ఏడు అనుబంధ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇక్కడ సంఖ్య 1900లకు చేరింది. మహబూబాబాద్‌ పరిధిలో 1783 ఉండగా వాటికి 26 అనుబంధ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వాటి సంఖ్య 1809 అయింది.
  •  రెండు పార్లమెంటు స్థానాల పరిధిలో అత్యధికంగా వరంగల్‌ పశ్చిమ శాసనసభ నియోజకవర్గంలో 2,83,446 మంది ఓటర్లు ఉన్నారు. అతి తక్కువగా భద్రాచలం శాసనసభ నియోజకవర్గంలో 1,52,683 మంది ఉన్నారు. మిగిలిన ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో 2 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని