logo

రాతియుగం నాటి కంకణ శిల లభ్యం

సుమారు ఆరు వేల ఏళ్ల నాటి అపురూపమైన కొత్త రాతియుగం పనిముట్టు కంకణ శిలను ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని భూపతిపురం గ్రామంలో కనుగొన్నట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ రామోజు హరగోపాల్‌, పరిశోధక సభ్యులు అహోబిలం కరుణాకర్‌, మహమ్మద్‌ నసీరుద్దీన్‌, చిడం రవి తెలిపారు

Updated : 30 Apr 2024 06:04 IST

భూపతిపురం గ్రామంలో లభించిన కంకణ శిల
సుమారు ఆరు వేల ఏళ్ల నాటి అపురూపమైన కొత్త రాతియుగం పనిముట్టు కంకణ శిలను ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని భూపతిపురం గ్రామంలో కనుగొన్నట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ రామోజు హరగోపాల్‌, పరిశోధక సభ్యులు అహోబిలం కరుణాకర్‌, మహమ్మద్‌ నసీరుద్దీన్‌, చిడం రవి తెలిపారు. ఈ రాతి పరికరాన్ని తవ్వుకోల మీద, వలలను ముంచేందుకు బరువుగా, పూసలను మెరుగుపెట్టేందుకు ఉపయోగపడేదని అన్నారు. ఇనుము లోహాన్ని కనిపెట్టని కాలంలో డోలరైట్‌ రాయిని కంకణశిలగా మలచడంలో ఆనాటి మనుషుల పనితీరుకు అద్దం పడుతోంది. ఇటువంటి శిలను కర్ణాటక రాష్ట్రం సంగనకల్లులో చరిత్రకారుడు ప్రొఫెసర్‌ కొరిశెట్టి రవి తవ్వకాలలో సేకరించగా, ప్రస్తుతం అది బళ్లారిలోని మ్యూజియంలో ఉంది.

- న్యూస్‌టుడే, కన్నాయిగూడెం

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని