logo

వారధి నిర్మాణ పనులు వేగవంతం

ఏటూరునాగారం మండలంలోని బూటారం గ్రామం నుంచి ఎలిశెట్టిపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో మాటొర్రెపై నిర్మిస్తున్న వారధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

Published : 05 May 2024 05:36 IST

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: ఏటూరునాగారం మండలంలోని బూటారం గ్రామం నుంచి ఎలిశెట్టిపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో మాటొర్రెపై నిర్మిస్తున్న వారధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రూ.4 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ వంతెన నిర్మాణ పనులను ఫిబ్రవరి 11, 2024న రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క శంకుస్థాపన చేశారు. వారం వ్యవధిలో పనులు మొదలుపెట్టగా, ప్రస్తుతం ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

అటవీ శాఖ అభ్యంతరం 

నాలుగేళ్ల కిందటే దీనిని నిర్మించాల్సి ఉండగా, అటవీ శాఖ అభ్యంతరంతో ఇంతకాలం పనులు జరగలేదు. దాంతో మంజూరైన నిధులు సైతం వెనక్కివెళ్లాయి. గ్రామస్థులు విజ్ఞప్తి మేరకు మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ చూపి నిధులు మంజూరు చేయించారు. ఎలిశెట్టిపల్లి గ్రామస్థులు అటవీ మార్గం ద్వారా ఇక్కడి వరకు వచ్చినా.. మాటొర్రె పొంగిపొర్లడంతో ఆగిపోవాల్సిన పరిస్థితి. గతంతో ఉన్న హైలెవల్‌ కాజువేపై నుంచి వరద పారేది. దాంతో ఒర్రెను దాటుకుని రావడం చాలా కష్టంగా ఉండేది.


వర్షాకాలం ఆరంభంలోగా పూర్తి చేయిస్తాం..

- రఘువీర్‌, డిప్యూటీ ఈఈ, ఆర్‌అండ్‌బీ

దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నాం.. వారధి నిర్మాణ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. వర్షాకాలం ఆరంభానికి ముందుగానే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని