logo

స్వాతంత్య్రం తెచ్చింది.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌

దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించాలని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.

Published : 07 May 2024 07:07 IST

ఖిలావరంగల్‌లో మాట్లాడుతున్న మంత్రి సురేఖ చిత్రంలో ఎంపీ అభ్యర్థి కావ్య

ఖిలావరంగల్‌, న్యూస్‌టుడే: దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించాలని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి ఖిలావరంగల్‌ పడమరకోట చమన్‌ కూడలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నిరుపేదలు బాగుపడాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. రాష్ట్ట్ర్రంలో ఆరు సంక్షేమ పథకాల అమలు మహిళల పాలిట వరంగా మారాయన్నారు. భారాస, భాజపాలకు ఓటు వేస్తే రజాకార్ల రాజ్యం వస్తుందని విమర్శించారు. గత పదేళ్లలో ఆ రెండు పార్టీలు దోచుకున్నది ఈ ఎన్నికల్లో పంచుతున్నారని.. డబ్బులిస్తే తీసుకొని చేతి గుర్తుకు ఓటు వేయాలని మంత్రి కోరారు. ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మాట్లాడుతూ.. వరంగల్‌ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఏనుమాముల గుమాస్తాల సంఘం అధ్యక్షుడు ఇనుముల మల్లేశం, అండర్‌ రైల్వేగేట్‌ ఐకాస కన్వీనర్‌ నాగవెళ్లి సాంబయ్యతో పాటు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బైరబోయిన ఉమ దామోదర్‌, శ్రీనివాస్‌, శ్యాం, ప్రకాశ్‌ పాల్గొన్నారు.

కొత్తవాడ: కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వస్తుందని మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. కొత్తవాడలోని ఓ వేడుకల మందిరంలో ప్రాథమిక చేనేత సహకార సంఘాలు, మ్యాక్స్‌ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం పద్మశాలి ఆశీర్వాద సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యతో కలిసి మంత్రి హాజరై మాట్లాడారు. కులాంతర, ప్రేమ వివాహాలతో రెండు విధాలుగా ఓట్లను అభ్యర్థించవచ్చని ఆమె చమత్కరించారు. కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు పద్మశాలీలు తీర్మానం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని