బాలల రక్షణకు ప్రత్యేక చర్యలు
బాలలు, కౌమార బాలికల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రశాంతి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు.
గోడపత్రాలు ఆవిష్కరిస్తున్న కలెక్టర్ ప్రశాంతి, అధికారులు
భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: బాలలు, కౌమార బాలికల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రశాంతి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. బాలలకు రక్షణ, పునరావాసం కల్పించడంపై శ్రద్ధ చూపాలన్నారు. బాల కార్మికులను గుర్తించేందుకు 20 మండలాల్లో ఆరు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. బడి బయట పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించేలా కృషి చేయాలన్నారు. బాలలను కార్మికులుగా మార్చి పనులు చేయించే యాజమాన్యాలపై కేసులు పెట్టి జరిమానా విధించాలని కార్మికశాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై రూపొందించిన గోడపత్రాలను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. జిల్లా కార్మిక శాఖాధికారిణి లక్ష్మి, సబ్‌కలెక్టర్ సూర్యతేజ, అదనపు ఎస్పీ ఏటీవీ రవికుమార్, ఆర్డీవో దాసి రాజు, ఐసీడీఎస్ పీడీ సుజాతారాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రూ.20.78 కోట్లతో నీటి పారుదల పనులు
భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: జిల్లాలో రూ.20.78 కోట్ల వ్యయంతో నీటి పారుదల పనులు చేపడుతున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. సంబంధిత అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. పనులు త్వరగా ప్రారంభించి కచ్చితత్వంతో పూర్తి చేయాలన్నారు. నరసాపురం, యలమంచిలి ప్రాంతాల్లో బ్యాక్ వాటర్ సమస్యతో 3,500 ఎకరాల్లో పంట వేయలేకపోతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన పనులకు ప్రతిపాదన రూపొందించాలని ఆదేశించారు. కాలువల ఆక్రమణలు, షట్టర్ల పనులు, ఇతర అంశాలపై సమీక్షించారు. జలవనరుల శాఖ జిల్లా అధికారి నాగార్జునరావు, ఈఈ దక్షిణామూర్తి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
‘NEET PG అర్హత మార్కులు.. వారికోసమే తగ్గించారా?’: కాంగ్రెస్