logo

అర్చకులపై దాడి దారుణం

కాకినాడ నగరంలోని శివాలయంలో అర్చకులపై దాడికి పాల్పడటం దారుణమని తెదేపా బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్‌ బుచ్చి రామ్‌ప్రసాద్‌ అన్నారు.

Published : 27 Mar 2024 04:04 IST

మాట్లాడుతున్న తెదేపా బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్‌ బుచ్చి రామ్‌ప్రసాద్‌

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: కాకినాడ నగరంలోని శివాలయంలో అర్చకులపై దాడికి పాల్పడటం దారుణమని తెదేపా బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్‌ బుచ్చి రామ్‌ప్రసాద్‌ అన్నారు. స్థానిక తెదేపా జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ కార్పొరేటర్‌, వైకాపా నేత ఎస్‌.చంద్రరావు ఆలయంలోని సహాయ అర్చకుడు వెంకట సత్యసాయిని అకారణంగా దుర్భాషలాడి చేయి చేసుకున్నారన్నారు. ఈ ఘటనను అడ్డుకున్న మరో అర్చకుడు విజయ్‌కుమార్‌పైనా చేయి చేసుకోవడం బాధాకరమని తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమితి ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌  ఎంబీఎస్‌ శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత అర్చకులు, బ్రాహ్మణులపై దాడులు పెరిగాయన్నారు. ప్రజలందరూ బాగుండాలని పూజలు చేసే వారిపై  దాడులకు పాల్పడం దారుణమన్నారు. ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపు ఇచ్చారు. అర్చకులపై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు పోరాడతామన్నారు. సమావేశంలో సమితి అధికార ప్రతినిధి ఈమని సూర్యనారాయణ, బ్రాహ్మణ సమాఖ్య నాయకుడు ఎస్‌.దుర్గాప్రసాద్‌, తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు జగదీశ్‌బాబు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని