logo

మీ ఓటు పదిలమేనా?

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఓట్ల పండగలో పాల్గొనేందుకు మీ ఓటు పదిలంగా ఉందో లేదో తెలుసుకున్నారా? వెంటనే తనిఖీ చేసుకోండి. ఈ ఎన్నికల్లో ఓటు వేసే వారికోసం ప్రభుత్వం వచ్చే నెల 15 వరకూ నమోదు గడువు ఇచ్చింది.

Published : 27 Mar 2024 04:08 IST

లేకుంటే దరఖాస్తు చేసుకోండి
ఏప్రిల్‌ 15 వరకూ గడువు

కుక్కునూరు, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఓట్ల పండగలో పాల్గొనేందుకు మీ ఓటు పదిలంగా ఉందో లేదో తెలుసుకున్నారా? వెంటనే తనిఖీ చేసుకోండి. ఈ ఎన్నికల్లో ఓటు వేసే వారికోసం ప్రభుత్వం వచ్చే నెల 15 వరకూ నమోదు గడువు ఇచ్చింది. ఇప్పుడు కొత్త ఓటు నమోదుకు ఫారం-6లు స్వీకరిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఓటర్లు జాబితాలు ప్రచురణ అయిపోయినందున, ఇప్పటి నుంచి ఏప్రిల్‌ 15 వరకూ వచ్చే కొత్త ఓటర్లను అనుబంధ(సప్లిమెంటరీ)జాబితాలో చేరుస్తామని వివరిస్తున్నారు. ్త్ర తుది జాబితా నాటికి ఏలూరు జిల్లాలో 16,24,416 మంది ఓటర్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 14,61,338 మంది ఓటర్లు నమోదయ్యారు. ఇందులో రెండు జిల్లాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఏలూరు జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాల్లో మహిళా ఓటర్లు సంఖ్య 8,30,390 కాగా, పురుష ఓటర్లు 7,93,897 మంది. పురుషుల కంటే మహిళల ఓట్లు 36,498 అధికంగా ఉన్నాయి. పశ్చిమలో మహిళా ఓటర్లు 7,44,308 మంది  కాగా, పురుష ఓటర్లు 7,16,956గా ఉన్నారు.  ఈ జిల్లాలో కూడా 27,352 మంది మహిళా ఓటర్లు అధికంగా నమోదయ్యారు.

ఓటర్లకు అవగాహన లేదు.. అధికారులూ పట్టించుకోరు..

ఓటరు జాబితాల పరిశీలనపై ఓటర్లు ఉదాశీనంగా వ్యవహరిస్తుంటారు. తమ ఓటు ఉందా? ఉంటే తమ పోలింగు బూత్‌లలోనే ఉందా? తమ కుటుంబ సభ్యుల ఓట్లన్నీ ఒకే చోట ఉన్నాయా అన్న అంశాలను పరిశీలించుకోవాలి. దీనిపై చాలా మందికి అవగాహన లేదు. తుది జాబితా విడుదల చేసిన తరువాత ఆయా పోలింగు కేంద్రాలు, ఆన్‌లైన్‌లో వాటిని అందుబాటులో ఉంచినప్పటికీ జాబితాలో తమ పేరు ఉన్నదీ లేనిదీ కూడా చూసుకోలేదు. సాధారణంగా ఓటు ఎక్కడ ఉందో బీఎల్వోలు ఓటరుకు వివరించాలి. ఏదైనా తప్పిదం ఉంటే వారి చేత ఫారం-8 దరఖాస్తు పెట్టించి నివాస ప్రాంతానికి సమీప కేంద్రంలోనికి మార్చేలా చూడాలి. ఒక కుటుంబానికి చెందిన ఓటర్లంతా ఒకే పీఎస్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలి.

జాబితాలో పేరు లేకపోతే..

ఓటరుగా నమోదైనప్పటికీ ఎన్నికల రోజున జాబితాలో చాలా మంది తమ పేర్లు లేవని ఆందోళన చెందుతూ ఉంటారు. దాని బదులు ముందుగానే మన పేరు చూసుకోవటం మంచిది. ఒకవేళ పేరు కనిపించకపోతే వెంటనే కొత్త ఓటరు నమోదుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతను పరిశీలించి అధికారులు ఓటేసే హక్కును కల్పిస్తారు. దీంతో పాటు చిరునామా మార్చుకోవాలన్నా ఇంకా అవకాశం ఉంది. దానికి ఫారం-8 వినియోగించాలి. గ్రామ/వార్డు సచివాలయం, తహసీల్దార్‌ కార్యాలయంలోని బూత్‌ స్థాయి అధికారులకు దరఖాస్తులు అందజేయాలి. ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌, హెచ్‌టిటిపి//సీˆఈవోఆంధ్రా.నిక్‌.ఇన్‌., హెచ్‌టీటీపీˆ//ఓటర్స్‌.ఈసీఐ.జీవోవి.ఇన్‌ వెబ్‌సైట్‌ల ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని