logo

అప్పు తీర్చే విషయంలో ఘర్షణ.. భర్త చేతిలో హతం

తన మాట కాదన్నందుకు కట్టుకున్న భార్యను కడతేర్చిన ఘటన జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో చోటుచేసుకుంది.

Updated : 02 May 2024 05:46 IST

ఝాన్సీ (పాత చిత్రం)

 జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: తన మాట కాదన్నందుకు కట్టుకున్న భార్యను కడతేర్చిన ఘటన జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో చోటుచేసుకుంది. ఈ దారుణానికి సంబంధించి పోలీసుల కథనం మేరకు.. బుట్టాయగూడేనికి చెందిన బొబ్బర వంశీకి, జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురానికి చెందిన ఝాన్సీ(33)తో 19 ఏళ్ల క్రితం వివాహమైంది. వంశీ తాపీˆమేస్త్రీ కాగా, ఝూన్సీ జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తోంది. భార్యాభర్తలు శ్రీనివాసపురంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొన్నాళ్ల కిందట.. ఉంటున్న ఇంటిని పడేసి, డాబా నిర్మించుకున్నారు. వంశీ చెడు వ్యసనాలకు, ఇల్లు కట్టేందుకు కూడా అప్పులు చేశారు. వాటిని తీర్చే దారిలేక ఇల్లు విక్రయిద్దామని భార్యతో తరచూ చెప్పేవాడు. దీనికి ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో బుధవారం ఇంటి వద్దే ఉన్న వంశీ తన కుమారులకు చరవాణి ఇచ్చి బయటకు వెళ్లి ఆడుకోవాలని చెప్పి పంపాడు. అనంతరం ఝూన్సీతో గొడవకు దిగాడు. అప్పు తీర్చే విషయంలో  ఇద్దరి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. ఆ సమయంలో పదునైన కత్తితో భార్య మెడపై దాడిచేసి, ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి వంశీ జారుకున్నాడు. కేకలు గమనించిన చుట్టుపక్కల వారు స్థానికంగా ఉంటున్న ఝూన్సీ సోదరుడు శోభన్‌బాబుకు సమాచారం అందించారు. అతడు వచ్చి ఇంటి తాళం పగులగొట్టి తలుపు తెరిచి చూడగా రక్తపు మడుగులో ఝూన్సీ విగత జీవిగా పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న పట్టణ ఎస్సై జ్యోతిబాస్‌ మృతురాలి బంధువుల నుంచి వివరాలు సేకరించారు. ఝాన్సీ మృతదేహం వద్ద ఆమె కుమారులు విలపిస్తున్న తీరు చూపరులు, బంధువులను కలచివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని