logo

జగనొస్తే నరకం చూడాల్సిందే!

ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం ఏలూరు లో నిర్వహించిన సిద్ధం సభ నగర ప్రజలకు నరకం చూపించింది.

Updated : 02 May 2024 05:33 IST

ఈనాడు, ఏలూరు, న్యూస్‌టుడే, ఏలూరు టుటౌన్‌, వన్‌టౌన్‌, అర్బన్‌, గ్రామీణ: ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం ఏలూరు లో నిర్వహించిన సిద్ధం సభ నగర ప్రజలకు నరకం చూపించింది. మండుటెండ..ఉక్కపోతతో  ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉదయం 11 గంటల నుంచే పోలీసులు ఆంక్షల చట్రంలో బంధించటంతో జన జీవనం అతలాకుతలమైంది. 40 నిమిషాల సీఎం ప్రసంగం కోసం ప్రజలను ఏడు గంటల పాటు అవస్థలు పెట్టారు.

 దుకాణాలు మూసివేత

దుకాణాల మూత.. ఆంక్షల మోత..

సభా ప్రాంగణానికి చుట్టుపక్కల 2 కిమీ మేర రహదారులకు బారికేడ్లు ఆడ్డుపెట్టి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేశారు. అగ్నిమాపక కేంద్రం కూడలి నుంచి కోర్టు సెంటర్‌ రోడ్డులో సభ జరిగే ప్రాంతంలో రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్లు తొలగించారు. అక్కడ అడ్డుగా ఉన్న స్తంభం తొలగించారు. ఆర్‌ఆర్‌పేట నుంచి ఆసుపత్రి మీదుగా కోర్టు సెంటర్‌కు వచ్చే ద్వారాన్ని, డీపీవో కార్యాలయం వైపు వెళ్లే రోడ్డును బారికేడ్లతో పూర్తిగా మూసేశారు. ఉదయం నుంచే పోలీసులు దుకాణాలను మూయించి, బారికేడ్లు అడ్డుగా పెట్టారు. సర్వజన ఆసుపత్రికి వెళ్లే రోడ్డులో సభ నిర్వహించడంతో ఆ మార్గం మూసేశారు. దీంతో ఆసుపత్రికి వెళ్లే రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సభ అనంతరం చాలాసేపటి వరకు ట్రాఫిక్‌ నిలిపేశారు. సభ ముగిసిన అరగంట ముందు నుంచే ఆ చుట్టు పక్కల ప్రాంతాలైన జడ్పీ కూడలి, టీటీడీ కూడలి, సీఆర్‌ఆర్‌ పబ్లిక్‌ స్కూల్‌ కూడలి, కొత్తబస్టాండ్‌ లోబ్రిడ్జి ప్రాంతం, మినిబైపాస్‌ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను ఎక్కడికక్కడే నిలిపివేశారు. బస్సులను పాత బస్టాండుకు మళ్లించడంతో ప్రయాణికులు పడిగాపులు పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని