logo

అంతా గందరగోళం

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని.. అర్హులందరూ నిర్భయంగా, ఇబ్బంది లేకుండా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనువైన పరిస్థితులు కల్పించామని అధికారులు ఊదరగొడుతున్నారు.

Published : 05 May 2024 05:45 IST

తపాలా ఓటింగ్‌పై కొరవడిన స్పష్టత
ఉద్యోగుల ఆందోళన

ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు సర్దిచెబుతున్న ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వో ముక్కంటి

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని.. అర్హులందరూ నిర్భయంగా, ఇబ్బంది లేకుండా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనువైన పరిస్థితులు కల్పించామని అధికారులు ఊదరగొడుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఎన్నికల విధులకు నియమితులైన సిబ్బంది ఈ నెల 4, 5 తేదీల్లో తపాలా బ్యాలెట్‌ వినియోగించుకునే అవకాశం ఉండగా.. అధికారుల తీరుతో గందరగోళం నెలకొని వారు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

నిబంధనలకు తూట్లు: ఏలూరులోని ఫెసిలిటేషన్‌ కేంద్రం బయట ఎన్నికల ప్రచారం చేస్తున్న వైకాపా వర్గీయులు

  • ఉద్యోగులు తపాలా ఓటుకు ఎక్కడ దరఖాస్తు చేశారో అక్కడికే వెళ్లి ఓటు వేయాలని, పనిచేసే చోటే ఓటు వేయాలని చెప్పడంతో సమస్య మొదలైంది. ఏలూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రానికి శనివారం పెద్ద సంఖ్యలో సిబ్బంది వచ్చారు. బ్యాలెట్‌ వినియోగించుకోవాలని చూస్తే వివరాలు ఇక్కడ లేవంటూ అధికారులు చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. ఎన్నికల సిబ్బందికి ఈ నెల 4, 5 తేదీల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వీటికి హాజరు కావాలా? లేక ఓటు వేయడానికి తాము పనిచేసే ప్రాంతాలకు వెళ్లాలా? అనే సందిగ్ధంలో పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనే భావనతో ఉద్దేశపూర్వకంగా తపాలా బ్యాలెట్‌ విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు.

వేచి ఉన్న ఉద్యోగులు

  • ఏలూరుతో పాటు జిల్లాలోని ఇతర ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అన్నిచోట్లా ఉద్యోగులు ఆందోళనలు చేశారు. తమకు కేటాయించిన ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లోనే ఓటు వేసే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. తమకు ఓటున్న ప్రాంతంలో కాకుండా పనిచేసే చోటుకు వెళ్లి ఓటు వేయాలని చెప్పడం సరికాదని అంటున్నారు.  ఏలూరులోని ఫెసిలిటేషన్‌ కేంద్రానికి కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ వచ్చి మౌలిక వసతుల తీరును పరిశీలించారు. ఉద్యోగులు పని చేసే చోట తపాలా బ్యాలెట్‌ వేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.  తపాలా బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులందరికీ తప్పనిసరిగా అవకాశం కల్పిస్తామన్నారు.

ఏలూరు గ్రామీణ, కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5690 మంది ఉద్యోగులు తపాలా బ్యాలెట్‌ వినియోగించుకున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని