logo

అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యం

దేశంలో అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని భాజపా ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు.

Published : 05 May 2024 05:49 IST

సంఘీభావం తెలుపుతున్న తెదేపా, భాజపా, జనసేన నాయకులు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: దేశంలో అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని భాజపా ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. భీమవరంలో శనివారం జరిగిన బీసీ సామాజిక వర్గీయుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. నరసాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మకు ఓటు వేస్తే బీసీ సామాజిక వర్గీయుడైన ప్రధాని మోదీకి మద్దతు ఇచ్చినట్లు అవుతుందన్నారు. ఏపీలో తెదేపా, భాజపా, జనసేన కలిసి పోటీ చేయడం విజయానికి సంకేతమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు గుర్తింపు రావడానికి దివంగత ఎన్టీఆర్‌ కారణమన్నారు. దేవేంద్రగౌడ్‌, పితాని సత్యనారాయణ, యనమల రామకృష్ణుడు వంటి నాయకులకు గుర్తింపు లభించిందన్నారు. 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో బీసీలు స్థానిక సంస్థల్లో పదవులు పొందుతున్నారన్నారు. మాజీ మంత్రి, తెదేపా ఆచంట నియోజకవర్గ అభ్యర్థి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ బీసీలు కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఉన్నారన్నారు. భాజపా బీసీల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేసిందని ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. భాజపా క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ పాకా వెంకట సత్యనారాయణ, నాయకులు చెనమల్ల చంద్రశేఖర్‌, కాయిత సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

దళితులను మోసగించిన జగన్‌.. దళితులను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నమ్మించి మోసం చేశారని దళిత వర్గాల ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు చెట్టే రాజు అన్నారు. భీమవరంలోని భాజపా కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. మాదిగ సంఘాల ఐకాస మద్దతు భాజపా, తెదేపా, జనసేన కూటమికేనని స్పష్టం చేశారు. అనంతరం భాజపా జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ, నాయకుల చేతుల మీదుగా కరపత్రాలను విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని