logo

‘పులివెందుల నియోజకవర్గం బీసీలకు కేటాయిస్తారా’

పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీసీలకు కేటాయించి తర్వాత చంద్రబాబునాయుడిను విమర్శించాలని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు హరిప్రసాద్‌, గోవర్ధన్‌రెడ్డి, సీనియర్‌ నాయకుడు లక్ష్మీరెడ్డి తదితరులు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి

Published : 25 Sep 2022 03:41 IST

మాట్లాడుతున్న నేతలు గోవర్ధన్‌రెడ్డి, హరిప్రసాద్‌, మూర్తి తదితరులు

అరవిందనగర్‌ (కడప), న్యూస్‌టుడే : పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీసీలకు కేటాయించి తర్వాత చంద్రబాబునాయుడిను విమర్శించాలని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు హరిప్రసాద్‌, గోవర్ధన్‌రెడ్డి, సీనియర్‌ నాయకుడు లక్ష్మీరెడ్డి తదితరులు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సూచించారు. తెదేపా జిల్లా కార్యాలయంలో శనివారం లీగల్‌ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీఎస్‌మూర్తితో కలిసి విలేకరులతో మాట్లాడారు. వైకాపాలో ఉమ్మడి జిల్లా నుంచి ఒకే సామాజిక వర్గానికి తప్ప మరెవ్వరికీ సీట్లు ఇవ్వలేదన్న విషయాన్ని మరిచినట్లున్నారన్నారు. బద్వేలు, రైల్వేకోడూరు రెండూ ఎస్సీలకు కేటాయించినందన వారికి అవకాశం కల్పించారే తప్ప మరెక్కడా ఏ కులానికి కేటాయించలేదని విమర్శించారు. వైకాపాలో సామాజిక న్యాయం ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు. మైదుకూరు, రాజంపేట, కడప, రాయచోటి నియోజకవర్గాలను తెదేపా బలిజలు, బీసీలకు కేటాయించిన విషయాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మరిచినట్లున్నారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. సమావేశంలో తెదేపా నాయకులు గుర్రప్ప, శివశంకర్‌రెడ్డి, జనార్దన్‌, సుబ్బారెడ్డి, కొమ్మలపాటి సురేష్‌, శ్రీనివాసులు, ఆదినారాయణరావు, ఓబులేసు, అమీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని