పనితీరు మారకుంటే చర్యలు తప్పవు : సీఎండీ
విద్యుత్తు యంత్రాంగం తమ పనితీరును మార్చుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు హెచ్చరించారు.
మాట్లాడుతున్న ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు, వేదికపై
సీజీఎం ధర్మజ్ఞాని, ఓఎస్‌డీ శ్రీనివాసులు, ఎస్‌ఈ మునిశంకరయ్య
కడప గ్రామీణ, న్యూస్‌టుడే : విద్యుత్తు యంత్రాంగం తమ పనితీరును మార్చుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు హెచ్చరించారు. జిల్లాకు వచ్చిన ఆయన గురువారం జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పలుచోట్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, ఇదివరకే అనేక అవకాశాలు ఇచ్చామని, ఇప్పటికైనా మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. వినియోగదారుల సేవల కోసమే మనందరం ఉన్నామన్న విషయం గుర్తుంచుకుని జాగ్రత్తగా పనిచేయాలని సూచించారు. ప్రమాణాల ప్రకారం సేవలు సకాలంలో పూర్తి చేయలేని పక్షంలో సంబంధిత అధికారులు వినియోగదారులకు పరిహారం చెల్లించాల్సి వస్తుందన్నారు. వాలిన స్తంభాలను, లూజు తీగలను సరిచేయాలని ఆదేశించారు. విద్యుత్తు నియంత్రికల వైఫల్యాలను నియంత్రించాలన్నారు. సంస్థ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు బకాయిలు వసూలు చేయాలని ఆదేశించారు. రైతులకు పగటి పూటే విద్యుత్తు ఇవ్వాలని స్పష్టం చేశారు. జగనన్న కాలనీల్లో విద్యుత్తు మీటర్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం విద్యుత్తు ఉద్యోగుల సామాజిక సేవాసంఘం దశమ వార్షికోత్సం సందర్భంగా కాలమానిని ఆవిష్కరించారు. అంతకు ముందు అనాథాశ్రమంలో వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. సమావేశంలో సీజీఎం ధర్మజ్ఞాని, ఓఎస్‌డీ శ్రీనివాసులు, ఎస్‌ఈ మునిశంకరయ్య, వైఎస్‌ఆర్, అన్నమయ్య జిల్లాల సీనియర్ అకౌంట్ అధికారులు, ఈఈలు, డీఈలు, ఏఈలు, విద్యుత్తు ఉద్యోగుల సామాజిక సేవాసంఘం సంఘ అధ్యక్షుడు నాగరాజు, ప్రధానకార్యదర్శి చలపతి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఫయాజ్, కోశాధికారి రఘు తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Lottery: సినీ నటి ఇంట్లో సహాయకుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు
-
India News
క్యాన్సర్, అధిక రక్తపోటుకు అల్లోపతిలో చికిత్స లేదు: బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
Politics News
కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/03/23)
-
General News
Viral: ప్రొజెక్టర్ స్క్రీన్గా బెడ్షీట్.. ఇది కదా వాడకమంటే..!
-
Ts-top-news News
ఒకే పేరు... 38 బ్యాంకు ఖాతాలు!.. బాధితుడికి తెలియకుండానే ఆన్లైన్లో అకౌంట్లు