logo

ప్రైవేట్‌లో పేద విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు

విద్యాహక్కు చట్టం ప్రకారం జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరంలో ఒకటో తరగతిలో 25 శాతం మందికి ఉచిత ప్రవేశాలు కల్పించనున్నామని డీఈవో రాఘవరెడ్డి తెలిపారు.

Published : 27 Mar 2023 06:22 IST

మాట్లాడుతున్న డీఈవో రాఘవరెడ్డి

కడప విద్య, న్యూస్‌టుడే : విద్యాహక్కు చట్టం ప్రకారం జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరంలో ఒకటో తరగతిలో 25 శాతం మందికి ఉచిత ప్రవేశాలు కల్పించనున్నామని డీఈవో రాఘవరెడ్డి తెలిపారు. ఏప్రిల్‌ 10వ తేదీ లోగా సీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో విద్యార్థుల వివరాలు నమోదు చేయాలన్నారు. ఆదివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 488 ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయని, 4 వేల మందికి పైగా పేద విద్యార్థులు ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలు పొందే అవకాశం ఉందన్నారు. అర్హులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి వెల్ఫేర్‌, ఎడ్యుకేషన్‌ సెక్రటరీ సహాయంతో వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలన్నారు. నేరుగా సీఎస్‌ఈ వెబ్‌సైట్‌లోనూ నమోదు చేయవచ్చని సూచించారు.

29వ తేదీలోగా ధ్రువపత్రాలు సమర్పించాలి : నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షకు హాజరైన విద్యార్థుల ధ్రువపత్రాల తనిఖీ కోసం విద్యార్థుల జాబితా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్‌ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఈవో రాఘవరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జాబితాలో పేరున్న విద్యార్థులు ఈ నెల 29వ తేదీలోగా కుల, ఆదాయ, వైకల్య ధ్రువపత్రాలు, 7వ తరగతి మార్కుల పత్రం, ఆధార్‌కార్డు నకలు తదితరాలు హాల్‌టికెట్‌ జిరాక్స్‌ కాపీతో జతపరిచి సంబంధిత పాఠశాల ద్వారా డీఈవో కార్యాలయంలో సమర్పించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని