logo

నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు

పులివెందుల పోలీసులు ఆలస్యంగానైనా స్పందించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated : 28 May 2023 04:53 IST

పులివెందులలో మట్కా బీటర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న డీఎసీˆ్ప వినోద్‌కుమార్‌, పోలీసులు

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, పులివెందుల: పులివెందుల పోలీసులు ఆలస్యంగానైనా స్పందించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మట్కా బీటర్లను శనివారం పోలీసుస్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇకపై జూదం, క్రికెట్ బెట్టింగ్‌ తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పిడితే కఠిన చర్యలతో పాటు పట్టణ బహిష్కరణ ఉంటుందని స్పష్టం చేశారు. ‘ఈనాడు’లో శనివారం ‘మట్కా.. అడ్డుకట్ట పడక’ శీర్షికన ప్రచురితమైన కథనంపై స్పందించిన డీఎస్పీ వినోద్‌కుమార్‌ పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులను పిలిపించి గట్టిగా హెచ్చరించారు. ఇక నుంచి పూర్తిస్థాయిలో నిఘా ఉంటుందని, శాంతిభద్రతలకు సహకరించాలని ఆదేశించారు. డీఎస్పీ వెంట సీఐ రాజు, ఎస్‌.ఐ.హుస్సేన్‌ తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని