logo

దివ్యాంగ విద్యార్థుల అభ్యున్నతిపై ప్రత్యేక శ్రద్ధ

దివ్యాంగ విద్యార్థుల అభ్యున్నతిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తోందని సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్‌ అంబవరం ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 02 Jun 2023 05:11 IST

దివ్యాంగ చిన్నారులకు కిట్లు పంపిణీ చేస్తున్న సమగ్ర శిక్ష ఏపీసీ ప్రభాకర్‌రెడ్డి

వేంపల్లె, న్యూస్‌టుడే: దివ్యాంగ విద్యార్థుల అభ్యున్నతిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తోందని సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్‌ అంబవరం ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. వేంపల్లె భవిత పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 210 మంది దివ్యాంగ చిన్నారులకు బోధనోపకరణాల కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగ చిన్నారులను భవిత కేంద్రం నిర్వాహకులు కంటికి రెప్పలా చూసుకోవాలన్నారు.  కార్యక్రమంలో జిల్లా సమ్మిళిత విద్య సమన్వయకర్త కేశవరెడ్డి, సహాయ సమన్వయకర్తలు రమణమూర్తి, దశరధ]రామిరెడ్డి, నెల్లూరు సీఆర్సీలు ప్రవీణ్‌కుమార్‌, జగన్‌, ఐఈఆర్టీలు యశోద, మమత, సిద్దారెడ్డి, విజయమ్మ, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని