logo

మిథున్‌రెడ్డి జగత్‌ కంత్రీ... నల్లారి గెలిస్తే కేంద్ర మంత్రి

రాజంపేట పార్లమెంటరీ స్థానం నుంచి ఎంపీగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతారు... అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారు... అదే మిథున్‌రెడ్డిని గెలిపిస్తే జగత్‌కంత్రీగా మారి మళ్లీ అవే దౌర్జన్యాలు, దోపిడీలను కొనసాగిస్తారని భాజపా సీనియర్‌ నాయకుడు చల్లపల్లె నరసింహారెడ్డి అన్నారు.

Published : 05 May 2024 04:49 IST

వారం రోజులు సైనికుల్లా పనిచేయండి
భాజపా నాయకులు చల్లపల్లె నరసింహారెడ్డి

మాట్లాడుతున్న భాజపా సీనియర్‌ నేత చల్లపల్లె నరసింహారెడ్డి

పెద్దమండ్యం, న్యూస్‌టుడే: రాజంపేట పార్లమెంటరీ స్థానం నుంచి ఎంపీగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతారు... అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారు... అదే మిథున్‌రెడ్డిని గెలిపిస్తే జగత్‌కంత్రీగా మారి మళ్లీ అవే దౌర్జన్యాలు, దోపిడీలను కొనసాగిస్తారని భాజపా సీనియర్‌ నాయకుడు చల్లపల్లె నరసింహారెడ్డి అన్నారు. శనివారం పెద్దమండ్యంలో భాజపా కూటమి సమావేశం తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైకాపా అరాచకాలతో  ప్రజలు విసిగిపోయారని ఓటు అనే ఆయుధంతో వారిని తరిమి వేయాలని పిలుపునిచ్చారు. పదవులున్నా లేకున్నా కార్యకర్తలకు అండగా ఉంటాం.. ఎవరూ అధైర్యపడవద్దు... మేమున్నాం కార్యకర్తలను మా ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుకుంటాం... అని భరోసా ఇచ్చారు. దీంతో ప్రజలు కేకలు వేశారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డిని, ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. అనంతరం నల్లారి నిరూప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వైకాపా నాయకులు అరాచకాలు తారాస్థాయికి చేరాయని వాటిని అరికట్టాలంటే వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. పీలేరుకు కేంద్ర బలగాలను అత్యధికగా రప్పిస్తున్నారని అందరూ స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో తెదేపా, జనసేన, భాజపా మండలాధ్యక్షులు జిట్టా వెంకట్రమణ, శంకరా, లక్ష్మీనారాయణ, మాజీ మండలాధ్యక్షులు సిద్దవరం ప్రసాద్‌, విశ్వనాథరెడ్డి, నాయకులు నార శ్రీనివాసులు, గంగాధర్‌, రఘునాథయాదవ్‌, అస్రప్‌ నాగూర్‌, రఫీ, భానుయాదవ్‌, నార నాగేశ్వర్‌, శ్రీరాములు, రమణ, సాంబశివారెడ్డి, చిలిపి, ప్రభాకర్‌రెడ్డి, సిద్దవరం శ్రీనివాసులు నిమ్మా నాగేశ్వర్‌, కూటమి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని