logo

ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు!

ఓటు విలువ అమూల్యం. ప్రజాస్వామ్యానికి అదే ప్రాణం. పౌరుడికే అదే వజ్రాయుధం. అలాంటి ఓటును రాజకీయ నాయకులు రకరకాల ప్రలోభాలు, డబ్బుతో కొనే ప్రయత్నం చేస్తున్నారు.

Published : 05 May 2024 04:57 IST

ప్రభుత్వ ఉద్యోగి ఇంటి ముందు ఏర్పాటు చేసిన పోస్టర్‌

న్యూస్‌టుడే, జమ్మలమడుగు గ్రామీణ: ఓటు విలువ అమూల్యం. ప్రజాస్వామ్యానికి అదే ప్రాణం. పౌరుడికే అదే వజ్రాయుధం. అలాంటి ఓటును రాజకీయ నాయకులు రకరకాల ప్రలోభాలు, డబ్బుతో కొనే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు ఓటర్లు కూడా డబ్బులు తీసుకుని ఓటేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఓటు విలువ తెలిపేలా జమ్మలమడుగులో ప్రభుత్వ ఉద్యోగులు బోనం విద్యాసాగర్‌, వేమవరం ప్రశాంతిలు తమ ఇంటి ముందు బోర్డు పెట్టడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. జమ్మలమడుగు పట్టణం ఎత్తపువారికాలనీలోని వారి ఇంటి ముందు ‘ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు’ అంటూ ముద్రించిన పోస్టర్‌ కట్టారు. ఈ బోర్డును చూసిన వాళ్లంతా శెభాష్‌ అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగి విద్యాసాగర్‌ను ‘న్యూస్‌టుడే’ పలుకరించగా ఓటు అమ్ముకోవద్దు. బాగా పనిచేసే అభ్యర్థికే ఓటేయాలి, మద్యం, డబ్బులకు లొంగి ఒటేసి మోసపోవద్దు. ఈ విషయాన్ని నేతలతో పాటు ఓటర్లకు చెప్పాలనే బోర్టు పెట్టాం అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని