logo

ఎస్సీ వర్గీకరణ జరగాలంటే వైకాపా ఓడిపోవాల్సిందే

ఎస్సీ వర్గీకరణ జరగాలంటే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాను ఓడించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, తెదేపా రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Published : 06 May 2024 04:09 IST

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

మందకృష్ణ మాదిగ, తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిలను గజమాలతో సత్కరిస్తున్న మాదిగలు

రాయచోటి గ్రామీణ, న్యూస్‌టుడే: ఎస్సీ వర్గీకరణ జరగాలంటే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాను ఓడించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, తెదేపా రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాయచోటిలోని ఓ ఫంక్షన్‌ హాలులో ఆదివారం నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమావేశానికి వారు ముఖ్య అతిథిలుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మండిపల్లి మాట్లాడుతూ సీఎం జగన్‌ మాదిగల సంక్షేమానికి ఎలాంటి పథకాలు ప్రవేశ పెట్టలేదని విమర్శించారు. మంచి భవిష్యత్తు ఉండాలంటే ఎన్‌డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్రమోదీ, రాష్ట్రంలో చంద్రబాబునాయుడితోనే మాదిగల అభివృద్ధి సాధ్యమన్నారు. ఎస్సీ వర్గీరణనను వ్యతిరేకించి మాదిగలను అణగదొక్కాలని చూసిన సీఎం జగన్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కార్యక్రమంలో జాతీయ నాయకులు నరేంద్ర మాదిగ, ఎంఎస్పీ సీనియర్‌ నాయకులు శివయ్య, ఎమ్మార్పీఎస్‌ నాయకులు మనోహర్‌, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని