logo

పోస్టల్‌ బ్యాలట్‌కు అధికార పార్టీ నగదు బదిలీ

నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు సోమవారం జరిగిన పోలింగ్‌లో 867 ఓటర్లకు 701 మంది హాజరయ్యారు. ఓటు వేసేందుకు వచ్చిన కొందరు అధికారులు ఎన్నికల విధులకు సంబంధించి ప్రోసీడింగ్‌ కాపీలు తీసుకు రాకపోవడంతో వెనక్కి పంపారు.

Published : 07 May 2024 05:43 IST

పోలింగ్‌ ప్రక్రియను తనిఖీ చేస్తున్న పరిశీలకురాలు కవిత

మదనపల్లె గ్రామీణ, పట్టణం, విద్య, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు సోమవారం జరిగిన పోలింగ్‌లో 867 ఓటర్లకు 701 మంది హాజరయ్యారు. ఓటు వేసేందుకు వచ్చిన కొందరు అధికారులు ఎన్నికల విధులకు సంబంధించి ప్రోసీడింగ్‌ కాపీలు తీసుకు రాకపోవడంతో వెనక్కి పంపారు. ప్రొసీడింగ్స్‌ తీసుకొచ్చిన తరువాత ఓటింగ్‌కు అనుమతించారు. ఉదయం 12 గంటల వరకు మందకొడిగా సాగిన ఓటింగ్‌ మధ్యాహ్నం నుంచి ఊపందుకుంది. సాయంత్రం 5 గంటలు ముగిసే సమయానికి 701 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీటీ కళాశాలలో జరుగుతున్న పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌ను ఎన్నికల పరిశీలకురాలు కవిత తనిఖీ చేశారు. ఆర్డీవో, ఆర్వో హరిప్రసాద్‌ పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఆటంకం కలుగకుండా, ఎన్నికల ప్రక్రియ సక్రమంగా నిర్వహించేలా దిశానిర్దేశం చేశారు. ఈ రెండు రోజుల్లో పోస్టు బ్యాలట్‌ ద్వారా ఓటు వేయలేనివారు 7, 8 తేదీల్లో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ ఓటు వేయవచ్చని ఆర్వో పేర్కొన్నారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్‌ అహ్మద్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థి గుల్నాజ్‌బేగం, తెదేపా ఏజెంట్లు కేంద్రం వద్ద పోలింగ్‌ను పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని