logo

14 హామీలతో ప్రొద్దుటూరు తెదేపా మేనిఫెస్టో విడుదల

ప్రొద్దుటూరు అభివృద్ధి కోరుతూ 14 రకాల ప్రధాన హామీలతో తెదేపా మేనిఫెస్టోను మంగళవారం ఆ పార్టీ  ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి తన కార్యాలయంలో విడుదల చేశారు.

Published : 08 May 2024 05:45 IST

ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు అభివృద్ధి కోరుతూ 14 రకాల ప్రధాన హామీలతో తెదేపా మేనిఫెస్టోను మంగళవారం ఆ పార్టీ  ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి తన కార్యాలయంలో విడుదల చేశారు. మెడికల్‌ కళాశాల ఏర్పాటు, రాజోలు ఆనకట్ట నిర్మాణానికి ప్రాధాన్యం, పట్టణంలో మురుగు వ్యవస్థ ఆధునికీకరణ, కూరగాయల మార్కెట్‌ నిర్మాణం, జిన్నారోడ్డు నుంచి ఎర్రగుంట్ల బైపాస్‌ లింకురోడ్డు నిర్మాణం, కులాల వారీగా సామాజిక భవనాలు, కూరగాయల మార్కెట్‌ నుంచి నార్త్‌ బైపాస్‌కు లింకురోడ్డు, వ్యాపారులకు స్వేచ్ఛయుత వాతావరణ కల్పన తదితర హామీలతో ప్రణాళిక రూపొందించారు. ఈ సందర్భంగా వరదరాజులురెడ్డి మాట్లాడుతూ..పేదలకు ఇళ్లు నిర్మించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రొద్దుటూరు జగనన్న కాలనీల్లో ఒక్క ఇళ్లు కూడా పూర్తి కాలేదన్నారు. ప్రతి లబ్ధిదారుల నుంచి రూ.35 వేలు వసూలు చేసి దళారీల ద్వారా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి దోచుకున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే ఇంటి నిర్మాణం త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. చంద్రబాబు చెప్పినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాళాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు అమల్‌రెడ్డి, ఈవీ.సుధాకర్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని