logo

మాజీ సీఎం కిరణ్‌ రాకతో పుంజుకున్న భాజపా బలం

ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాజంపేట పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రాకతో నిమ్మనపల్లెలో భాజపా బలం పుంజుకుందని నిమ్మనపల్లె మాజీ సర్పంచి రెడ్డివారి పెమ్మిరెడ్డి తనయుడు సునీల్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Published : 09 May 2024 04:50 IST

 

నిమ్మనపల్లెలో సునీల్‌కుమార్‌రెడ్డి స్వగృహంలో మాట్లాడుతున్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్‌బాషా, నాయకులు

నిమ్మనపల్లె, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాజంపేట పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రాకతో నిమ్మనపల్లెలో భాజపా బలం పుంజుకుందని నిమ్మనపల్లె మాజీ సర్పంచి రెడ్డివారి పెమ్మిరెడ్డి తనయుడు సునీల్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ నెల 6న సునీల్‌కుమార్‌రెడ్డి మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో భాజపాలో చేరారు. బుధవారం కలికరిలో ప్రధాని మోదీరాక సందర్భంగా జరుగుతున్న ఉమ్మడి తెదేపా, జనసేన, భాజపా అభ్యర్థి కిరణ్కుమార్‌రెడ్డి సభ విజయవంతానికి స్థానిక నాయకులతో కలసి జన సమీకరణ చేపట్టారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంపీగా, ప్రధానిగా మోదీ గెలుపుతో రాజంపేట పార్లమెంట్‌ స్థానం వారి చల్లని ఆశీస్సులతో అభివృద్ధిలో కొత్తపుంతలు తొక్కుతుందన్నారు. మండలంలో తనకున్న పట్టుతో ఉనికిని చాటి కూటమి అభ్యర్థుల విజయానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. సునీల్‌కుమార్‌రెడ్డి చేరిక కార్యక్రమంలో మాజీ సీఎం తనయుడు నిఖిలేష్‌రెడ్డి, మదనపల్లె తెదేపా అభ్యర్థి షాజహాన్‌బాషా, తెదేపా నాయకులు రాటకొండ బాబురెడ్డి, చింతపర్తి రెడ్డెప్పరెడ్డి, రాజన్న, మల్లికార్జున, శ్రీనివాసులురెడ్డి, శివ గంగిరెడ్డి, వ్యాపారవేత్త ఓం ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని