logo
Updated : 02/12/2021 06:02 IST

చిత్ర వార్తలు

రెండురోజుల పర్యటనలో భాగంగా నీతిఅయోగ్‌ బృందం బుధవారం గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించింది. ఈ సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడుతున్న ఉపాధ్యక్షుడు డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌, సభ్యులు


అప్రమత్తతే ముఖ్యం

ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అవగాహన ప్రదర్శన జరిగింది.


‘చతుర్ముఖ’ వెలుగులు

కార్తిక మాసం సందర్భంగా చేబ్రోలు కోనేరు వద్దనున్న చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరస్వామి కోవెల కొండంత వెలుగులు ఇముడ్చుకొని కనువిందుచేసింది. ఈ గుడితో పాటు చంద్రమౌళీశ్వరస్వామి దేవాలయంలోనూ గ్రామానికి చెందిన భౌతీరామ్‌ ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు.

- న్యూస్‌టుడే, చేబ్రోలు.


లక్ష్యంపైనే గురి

గుంటూరు జిల్లా ఉండవల్లి వద్దనున్న మంగళగిరి ఏపీఎస్పీ ఆరో పటాలం ఫైరింగ్‌ రేంజ్‌లో డీజీపీ గౌతం సవాంగ్‌ వార్షిక ఫైరింగ్‌ షూట్‌ను బుధవారం ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు ఫైరింగ్‌లో నైపుణ్యతను పరీక్షించుకున్నారు. వివిధ రకాల ఆయుధాలను వాడి లక్ష్యానికి గురి చేశారు. అనంతరం డీజీపీ నూతన ఆయుధాలను పరిశీలించారు.

- న్యూస్‌టుడే, తాడేపల్లి


ప్రపంచ ఎయిడ్స్‌ దినాన్ని పురస్కరించుకొని బుధవారం ప్రతిజ్ఞ చేస్తున్న తెనాలి జేఎంజే మహిళా కళాశాల విద్యార్థినులు. ప్రిన్సిపల్‌ సిస్టర్‌ షైనీ పర్యవేక్షించారు.
- తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే.
Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని