logo
Published : 02/12/2021 05:42 IST

భావోద్వేగ బందీలు

అమరావతి ఫీచర్స్‌, న్యూస్‌టుడే

* గుంటూరుకు చెందిన ఉద్యోగ దంపతులకు కుమారుడంటే ప్రాణం. ఏం కావాలన్నా క్షణాల్లో ఇచ్చేవారు. ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరంలో బైక్‌ కావాలని మారాం చేశాడు. డ్రైవింగ్‌పై పట్టు లేకపోయినా అతని ఇష్టాన్ని కాదనలేక కొనుగోలుకు రూ.1.50 లక్షలు ఇచ్చారు. స్పోర్ట్స్‌ బైక్‌పై కళాశాలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

* తండ్రిని కోల్పోయిన కుమారుడిని విజయవాడకు చెందిన ఒక తల్లి అతి గారాబం చేశారు. పాకెట్‌ మనీగా రూ.వేలు ఇచ్చేవారు. అతను జల్సాలకు అలవాటుపడ్డాడు. మత్తుకు బానిసై రూ.లక్షలు ఇవ్వకపోతే చనిపోతానని బెదిరించే పరిస్థితికి వచ్చాడు. ఆమె లొంగకపోవడంతో హతమార్చేంత పని చేశాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించి దారి తప్పిన కుమారుడిపై ఫిర్యాదు చేశారు.

బుడిబుడి అడుగుల వయసులో బొమ్మ కావాలని బిడ్డ అడిగితే తల్లిదండ్రులు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసి ఇచ్చి మురిసిపోతారు. క్రమేపి ఆ గారాబం భావోద్వేగంగా మారి బైకు, కారు, రూ.లక్షల నగదు వరకు తీసుకెళ్తుంది. అడిగింది ఇవ్వకపోతే ‘పుస్తకాలు ముట్టను.. ఇంట్లో నుంచి వెళ్లిపోతాను.. ఎవరికీ కనిపించకుండా పోతాను’ అంటూ బిడ్డలు భావోద్వేగాలతో చేసే బెదిరింపులకు ఎక్కువ మంది తల్లిదండ్రులు లొంగిపోతున్నారు. పెద్దల అతి గారాబం పిల్లల్ని పెడదారి పట్టిస్తుంది. వారి భావోద్వేగాలకు తల్లిదండ్రులు లొంగిపోకుండా ఉంటే వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన వారవుతారని నిపుణులు సూచిస్తున్నారు.

కేసులు పెరుగుతున్నాయ్‌..

మా అబ్బాయి, అమ్మాయి కళాశాలకు సరిగా వెళ్లడం లేదు. డబ్బులు, వస్తువులు కావాలని మారాం చేస్తున్నారనే ఫిర్యాదులతో సైకాలజిస్టుల వద్దకు వెళ్లే తల్లిదండ్రులు ఇటీవల పెరుగుతున్నారు. నెలకు సగటున విజయవాడలోని సైకాలజిస్టుల వద్దకు 100 నుంచి 150

ఇలా చేస్తే మేలు

* పిల్లలకు ఏవి అవసరమో వాటినే అందించాలి. తాహతు మించి ఇష్టాలు ఉంటే కుటుంబ ఆర్థిక పరిస్థితులు, నగదు దుబారా చేస్తే కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి.

* నైతిక విలువలు, క్రమశిక్షణతో కూడిన విద్య అందేలా చూడాలి. విలువల ఆధారిత అభ్యసన పిల్లలకు అందుతుందో లేదో తరచూ పరిశీలించాలి.

* చదువు పట్ల ఏకాగ్రత, శ్రద్ధ చూపని పిల్లల మనసుల్లో దాగి ఉన్న బాధల్ని అర్థం చేసుకోవాలి. వారి మనసులకు గాయమయ్యేలా, రెచ్చగొట్టేలా మాట్లాడకూడదు.

* ఫలానా తరగతిలో ఇన్ని మార్కులు సాధిస్తే కోరుకుంది కొని ఇస్తాను వంటి మాటలు వాడకూడదు. ప్రతిసారి అలాంటి అవకాశం వస్తుందని పిల్లలు కోరుకుని పక్కదారి పట్టే ప్రమాదం ఉంటుంది.

* ఇంట్లో పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు ఒకే మాటపై ఉండటం ఎంతో ముఖ్యం. ఇద్దరిలో ఎవరో ఒకరు మారాం చేసి వారి బలహీనతల్ని భావోద్వేగాలుగా పిల్లలు మలుచుకుంటున్నారు.

* భావోద్వేగాలకు పెద్దలు లొంగకుండా ఉండేందుకు వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడం ఎంతో ముఖ్యం. విద్యాలయాల యాజమాన్యాలు కూడా పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.

* చదువు.. లక్ష్యం తప్ప అనవసర వ్యాపకాలపై పిల్లల దృష్టి వెళ్లకుండా వారికి మహనీయులు, స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల జీవిత చరిత్రలను తెలియజేయాలి. సమాజంలో ఏ రంగం ఎలా ఉంది.. శ్రమజీవుల కష్టాల్ని ప్రత్యక్షంగా చూపాలి. ప్రకృతితో వారిని అనుసంధానం చేసి చెడు అలవాట్ల జోలికి వెళ్లకుండా చేయాలి.

* విద్యాలయాల్లో ప్రవర్తనాపరమైన లోపాల దిద్దుబాటుకు అవసరమైన ప్రేరణ తరగతులు.. సైకాలజిస్టులతో కౌన్సెలింగ్‌ కార్యక్రమాలు నిర్వహించాలి.

-డాక్టర్‌ టీఎస్‌ రావు, కౌన్సెలింగ్‌ సైకాలజిస్టు, విజయవాడ

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని