logo

Twins: కవలలకు జన్మనిచ్చిన 50 ఏళ్ల మహిళ

50 ఏళ్ల ఓ మహిళ ప్రభుత్వ ఆస్పత్రిలో కవలలకు జన్మనిచ్చారు. రాధికకు వివాహమై 25 సంవత్సరాలు అవుతున్నా పిల్లలు కలగకలేదు. ప్రైవేటు ఆస్పత్రిలో రూ. 5 లక్షల ఖర్చుతో కృత్రిమ గర్భధారణ చికిత్స పొందుతూ వచ్చారు. ఎనిమిదో నెలలో కాళ్ల వాపు తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఖర్చు భరించలేక చెన్నై ఎగ్మూరు ప్రసూతి ఆస్పత్రిలో చేరారు.

Updated : 26 May 2022 11:20 IST

రాధికకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఆస్పత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ విజయ

సైదాపేట, న్యూస్‌టుడే: 50 ఏళ్ల ఓ మహిళ ప్రభుత్వ ఆస్పత్రిలో కవలలకు జన్మనిచ్చారు. రాధికకు వివాహమై 25 సంవత్సరాలు అవుతున్నా పిల్లలు కలగకలేదు. ప్రైవేటు ఆస్పత్రిలో రూ. 5 లక్షల ఖర్చుతో కృత్రిమ గర్భధారణ చికిత్స పొందుతూ వచ్చారు. ఎనిమిదో నెలలో కాళ్ల వాపు తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఖర్చు భరించలేక చెన్నై ఎగ్మూరు ప్రసూతి ఆస్పత్రిలో చేరారు. అత్యవసర చికిత్స విభాగంలో ఆమెను ఉంచారు. చెన్నై రాజీవ్‌ గాంధీ ఆస్పత్రి ప్రత్యేక డాక్టరును పిలిపించి ఆయన సలహాలతో చికిత్స అందించారు. స్కానింగ్‌లో పిల్లల్లో రక్తప్రసరణ సక్రమంగా లేకపోవడంతో మెదడు అభివృద్ధి చెందలేదని తెలిసింది. దీనికి మెరుగైన చికిత్స అందించడంతోపాటు శస్త్రచికిత్స చేయడం ద్వారా రాధిక పిల్లలకు జన్మనిచ్చారు. నెల రోజులపాటు తల్లి ఐసీయూలో, పిల్లలు ఇంక్యుబేటర్‌లో ఉన్నారు. ప్రసుత్తం ముగ్గురూ ఆరోగ్యంగా కోలుకున్నారు. అలాగే వల్లి (47) అనే మహిళ కూడా వివాహమై 17 ఏళ్లుగా పిల్లలు లేకపోగా ఆమెకు కూడా ఎగ్మూరు పిల్లల ఆస్పత్రిలో విజయవంతంగా చికిత్స అందించారు.

శిశువుతో వల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని