logo
Published : 28/11/2021 03:52 IST

రండి... రక్తదానం చేయండి

30న అన్ని ఆర్టీసీ డిపోల్లో ప్రత్యేక శిబిరాలు

పాత తాండూరు, బషీరాబాద్‌, న్యూస్‌టుడే: అత్యవసర వైద్య సమయంలో రక్తం అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు అనేకం. దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారికి పక్షం రోజులకోసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. అదే గ్రూప్‌ రక్తం లేకపోతే చాలా కష్టం. గర్భిణికి రక్తం తక్కువగా ఉండి.. కాన్పు కోసం శస్త్ర చికిత్స చేయాల్సిన సమయంలో కనీసం ఒకటి నుంచి రెండు పొట్లాలు అవసరం అవుతుంది. ఇలాంటి సమయంలో రక్తం అందుబాటులో ఉంటే మనం ప్రాణదాతలు కావొచ్ఛు ఇందుకు సహజంగా స్వచ్ఛంద సంస్థలు, బ్లడ్‌ బ్యాంకులు చేయూతనిస్తాయి. ఈసారి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే కాదు..రక్తం సేకరించి రోగులకు అందింది ప్రాణదాతలమవుతామని ఆర్టీసీ ముందుకొస్తోంది.

పెద్దఎత్తున సేకరణకు ఏర్పాట్లు

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఎండీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈనెల 30న ఉదయం 9గంటల నుంచి ఒంటి గంట వరకు జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్‌ డిపోల పరిధిలో జరుగుతుంది. పెద్దఎత్తున కార్యక్రమాన్ని చేపట్టి సిబ్బంది మాత్రమే కాకుండా యువత, ఆరోగ్యవంతులు, ప్రయాణికుల నుంచి కూడా రక్తాన్ని సేకరించేందుకు ఆయా ఆర్టీసీ డిపో మేనేజర్లు, అధికారులు పిలుపునిచ్చారు. 29వ తేదీ సాయంత్రానికి రక్తదాతల వివరాలను నమోదు చేసుకొని అందుకు అనుగుణంగా సేకరణ ఖాళీ ప్యాకెట్లను సమకూర్చుకుంటారు. ఇందుకోసం అనుభవజ్ఞులైన వైద్యులు, రెడ్‌క్రాస్‌ స్వచ్ఛంద సంస్థ సహకారాన్ని ఆర్టీసీ తీసుకుంటోంది.

ఎన్నిసార్లయినా ఇవ్వొచ్చు: పవిత్ర, ప్రభుత్వ వైద్యాధికారిణి

ఆరోగ్యంగా ఉన్న వారు, యువకులు ఎన్నిసార్లయినా రక్తం దానం చేయవచ్ఛు ఎలాంటి అపోహలు వొద్ధు ఇచ్చిన కొన్ని గంటల్లోనే కొత్త రక్తం శరీరంలోకి వస్తుంది. శిబిరాలకు అందరూ స్వచ్ఛందంగా ముందుకురావాలి.

సిబ్బంది, యువత ముందుకు రావాలి : రాజశేఖర్‌, ఆర్టీసీ డిపో మేనేజరు, తాండూరు

రక్తదానానికి డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది, ప్రయాణికులు, యువకులు ముందుకు రావాలని కోరుతున్నాం. ప్రణాళిక ప్రకారం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందుకోసం అందరూ సహకరించాలి.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని