icon icon icon
icon icon icon

అమలాపురం

అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం (Amalapuram Lok Sabha constituency) 1952లో ఏర్పాటైంది. ఈ నియోజకవర్గాన్ని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించారు.

Updated : 28 Apr 2024 20:03 IST

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: ఇటీవల ఏర్పాటైన అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలో ఈ నియోజకవర్గం ఉంది. మొత్తం 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం (ఎస్సీ), రాజోలు (ఎస్సీ), పి.గన్నవరం (ఎస్సీ), కొత్తపేట, మండపేట అసెంబ్లీ స్థానాలు ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి.

ఓటర్లు: 2024 ఓటర్ల జాబితా ప్రకారం ఈ నియోజకవర్గంలో 15.11 లక్షల మంది ఓటర్లు ఉండగా.. 7.50లక్షల మంది పురుషులు, 7.60 లక్షల మంది మహిళలు, 17 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

గతంలో లోక్‌సభ స్పీకర్‌గా సేవలందించిన జీఎంసీ బాలయోగి 1991, 1998, 1999 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా విజయం సాధించారు.  2019 సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి గంటి హరీశ్‌ మధుర్‌పై వైకాపాకి చెందిన చింతా అనురాధ గెలుపొందారు.

ప్రస్తుతం తెదేపా నుంచి గంటి హరీశ్‌ (Ganti Harish Madhur) పోటీ చేస్తున్నారు. ఈయన లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన బాలయోగి కుమారుడు. తండ్రి మరణించాక వారి కుటుంబం చాలాకాలం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంది. బాలయోగిపై ఉన్న అభిమానంతో గత ఎన్నికల్లో తెదేపా హరీశ్‌కు టికెట్‌ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఓడిపోయినా... ఆయనకు నైతిక స్థైర్యాన్నిస్తూ ఇప్పుడు మళ్లీ ఎన్నికల బరిలో దించింది. మరోవైపు 2019 ఎన్నికల్లో రాజోలు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఏకైక వ్యక్తి రాపాక వరప్రసాదరావు  (Rapaka Vara Prasada Rao) ఆ తర్వాత వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన్నే అమలాపురం ఎంపీగా పార్టీ బరిలో నిలిపింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి జంగా గౌతమ్‌ బరిలో నిలిచారు.

  • అమలాపురంలో ఇప్పటివరకూ గెలుపొందిన అభ్యర్థులు వీళ్లే!
  • 1957: కానేటి. మోహన రావు (సీపీఐ)
  • 1962: బయ్య. సూర్యనారాయణ మూర్తి ( కాంగ్రెస్‌)
  • 1967: బయ్య. సూర్యనారాయణ మూర్తి ( కాంగ్రెస్‌)
  • 1971: బయ్య. సూర్యనారాయణ మూర్తి ( కాంగ్రెస్‌)
  • 1977: కుసుమ. కృష్ణమూర్తి (కాంగ్రెస్‌)
  • 1980: కుసుమ. కృష్ణమూర్తి (కాంగ్రెస్‌)
  • 1984: ఎ.జె. వెంకట బుచ్చి మహేశ్వరరావు (తెదేపా)
  • 1989: కుసుమ. కృష్ణమూర్తి (కాంగ్రెస్‌)
  • 1991: జి.ఎం.సి. బాలయోగి (తెదేపా)
  • 1996: కె.ఎస్‌.ఆర్‌. మూర్తి (కాంగ్రెస్‌)
  • 1998:  జి.ఎం.సి. బాలయోగి (తెదేపా)
  • 1999: జి.ఎం.సి. బాలయోగి (తెదేపా)
  • 2002: విజయకుమారి గంటి (తెదేపా)
  • 2004: జి.వి. హర్ష కుమార్‌ (కాంగ్రెస్‌)
  • 2009: జి.వి. హర్ష కుమార్‌ (కాంగ్రెస్‌)
  • 2014: పి. రవీంద్రబాబు (తెదేపా)
  • 2019: చింతా. అనురాధ (వైకాపా)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img