icon icon icon
icon icon icon

బాపట్ల

బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం 1977లో ఏర్పడింది. దీన్ని ఎస్సీలకు రిజర్వ్‌ చేశారు.

Updated : 28 Apr 2024 19:30 IST

ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో బాపట్ల (Bapatla Lok Sabha constituency) ఒకటి. పునర్విభజన ఫలితంగా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం గుంటూరు లోక్‌సభ నియోజకవర్గానికి వెళ్లగా ఈ నియోజకవర్గానికి ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం నుంచి సంతనూతలపాడు శాసనసభా స్థానం వచ్చి చేరింది.

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: ప్రస్తుతం ఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో బాపట్ల, వేమూరు, రేపల్లె అసెంబ్లీ స్థానాలు, ప్రకాశం జిల్లాలో చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు స్థానాలు ఉన్నాయి.

ఓటర్లు: తాజా గణాంకాల ప్రకారం మొత్తం 14,92,910 ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 7,31,730 మంది, మహిళలు 7,61,102 మంది ట్రాన్స్‌జెండర్లు 78 మంది ఓటర్లు ఉన్నారు. 

2019 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి మాల్యాద్రి శ్రీరామ్‌పై నందిగాం సురేష్‌ విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో వైకాపా నుంచి నందిగాం సురేష్‌ మరోసారి టికెట్‌ దక్కించుకోగా, తెదేపా కూటమి అభ్యర్థిగా మాజీ ఐపీఎస్‌ టి.కృష్ణప్రసాద్‌ బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి జేడీ శీలం పోటీ చేస్తున్నారు.

  • బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన అభ్యర్థులు వీరే!
  • 1977: పి.అంకినీడు ప్రసాదరావు (కాంగ్రెస్‌)
  • 1980: పి.అంకినీడు ప్రసాదరావు (కాంగ్రెస్‌)
  • 1984: చిమటా సాంబు (తెలుగుదేశం)
  • 1989: సలకల బెంజమిన్ (కాంగ్రెస్‌)
  • 1991: దగ్గుబాటి వెంకటేశ్వరరావు (తెలుగుదేశం)
  • 1996: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (తెలుగుదేశం)
  • 1998: నేదురుమల్లి జనార్ధనరెడ్డి (కాంగ్రెస్‌)
  • 1999: దగ్గుబాటి రామానాయుడు (తెలుగుదేశం)
  • 2004: దగ్గుబాటి పురందేశ్వరి (కాంగ్రెస్‌)
  • 2009: పనబాక లక్ష్మి (కాంగ్రెస్‌)
  • 2014: మాల్యాద్రి శ్రీరాం (తెలుగుదేశం)
  • 2019: నందిగాం సురేష్‌ (వైకాపా)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img