icon icon icon
icon icon icon

ఆయన కుమారుడిని కానందువల్లే రాజకీయ అవకాశాలు రాలేదు

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ- శరత్‌చంద్ర పవార్‌) అధినేత శరద్‌ పవార్‌ కుమారుడిని కానందువల్లే తనకు గతంలో రాజకీయ అవకాశాలు రాలేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ పేర్కొన్నారు.

Published : 10 May 2024 05:55 IST

శరద్‌ పవార్‌పై అజిత్‌ విమర్శ

పుణె: నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ- శరత్‌చంద్ర పవార్‌) అధినేత శరద్‌ పవార్‌ కుమారుడిని కానందువల్లే తనకు గతంలో రాజకీయ అవకాశాలు రాలేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ పేర్కొన్నారు. 80 ఏళ్లు దాటిన తర్వాత కొత్తవారికి పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పుణెలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో బాబాయ్‌పై అజిత్‌ పవార్‌ ఈ మేరకు విమర్శలు గుప్పించారు. ‘‘నా వయసు 60 ఏళ్లపైనే. మనకు అవకాశం రావాలా? వద్దా? మనం ఏమైనా తప్పు చేస్తున్నామా? అందుకే ఈ భావోద్వేగం. పవార్‌ సాహెబ్‌ కూడా మనకు దైవంతో సమానం. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ, ప్రతి వ్యక్తికీ ఓ సమయం ఉంటుంది. 80 ఏళ్లు దాటిన తర్వాత కొత్తవారికి అవకాశం కల్పించాలి. పవార్‌ కుమారుడినైతే నాకు అవకాశం వచ్చి ఉండేది. ఆయన కుమారుడిని కానందువల్లే ఆ (పార్టీ పగ్గాలు చేపట్టే) అవకాశం రాలేదు. ఇదెక్కడి న్యాయం?’’ అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img