icon icon icon
icon icon icon

37 ఏళ్ల తర్వాత.. హుజూర్‌నగర్‌

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1952లో తొలిసారి ఏర్పడిన నియోజకవర్గాలు 12. ఇందులో హుజూర్‌నగర్‌ ద్విసభ్య నియోజకవర్గంగా ఉంది.

Updated : 12 Nov 2023 12:23 IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1952లో తొలిసారి ఏర్పడిన నియోజకవర్గాలు 12. ఇందులో హుజూర్‌నగర్‌ ద్విసభ్య నియోజకవర్గంగా ఉంది. 1972 వరకు హుజూర్‌నగర్‌ నియోజకవర్గంగా కొనసాగింది. 1978లో రద్దయింది. రద్దయ్యేనాటికి ఇక్కడ ఆరుసార్లు (ఒక ఉప) ఎన్నికలు నిర్వహించారు. మూడుసార్లు పీడీఎఫ్, రెండు పర్యాయాలు కాంగ్రెస్, ఒకసారి స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. అప్పటివరకు ఈ నియోజకవర్గంలో ఉన్న హుజూర్‌నగర్, నేరేడుచర్ల, గరిడేపల్లి, మఠంపల్లి (పాక్షికం) మండలాలను మిర్యాలగూడ నియోజకవర్గంలో కలిపారు. మేళ్లచెరువు, మఠంపల్లి (పాక్షికం) మండలాలను 1978లో ఏర్పడిన కోదాడ నియోజకవర్గంలో చేర్చారు.  నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో హుజూర్‌నగర్‌ను నియోజకవర్గంగా పునరుద్ధరించారు. కోదాడ నియోజకవర్గంలో ఉన్న మేళ్లచెరువును, కోదాడ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో పాక్షికంగా ఉన్న మఠంపల్లిని, మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్న నేరేడుచర్ల, గరిడేపల్లి.. అయిదు మండలాలు కలిపి హుజూర్‌నగర్‌ నియోజకవర్గం ఏర్పాటైంది. 

- మేళ్లచెరువు, న్యూస్‌టుడే 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img