icon icon icon
icon icon icon

Harish Rao: మెదక్‌ భారాస అభ్యర్థిపై తప్పుడు ప్రచారం సరికాదు: హరీశ్‌రావు

భారాస అభ్యర్థిపై తప్పుడు ప్రచారం చేస్తూ ఓట్లు అడగటం సమంజసం కాదని.. భాజపా అభ్యర్థి రఘునందన్ రావు తప్పుడు మాటలు మానుకోవాలని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.

Published : 01 May 2024 12:27 IST

సిద్దిపేట: మెదక్‌ భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తూ ఓట్లు అడగటం సమంజసం కాదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. భాజపా అభ్యర్థి రఘునందన్ రావు తప్పుడు మాటలు మానుకోవాలని హితవు పలికారు. సిద్దిపేటలో వెంకట్రామిరెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ.. మెదక్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతున్నారని తెలిపారు. భారాసపై భాజపా గోబెల్స్ ప్రచారం చేస్తోందని విమర్శించారు. గతంలో దుబ్బాక నుంచి నకిలీ వీడియోలు చేసి వదిలారన్నారు. భాజపా అబద్ధాలు విని, వీడియోలు చూసి ప్రజలు మోసపోవద్దని సూచించారు. ప్రజలకు సేవ చేసేందుకే వెంకట్రామిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ఆయన మచ్చ లేని మనిషన్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ దుబ్బాకలో భాజపా తప్పుడు ప్రచారం చేసి గెలిచిందని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img