icon icon icon
icon icon icon

KTR: కాంగ్రెస్‌కు అదానీ, అంబానీ డబ్బు పంపుతుంటే ఈడీ ఏం చేస్తోంది?: కేటీఆర్‌

నోట్ల రద్దు విఫల ప్రయత్నమని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారా? అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు.

Published : 09 May 2024 11:34 IST

హైదరాబాద్‌: నోట్ల రద్దు విఫల ప్రయత్నమని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారా? అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. మోదీ ఇటీవల సభలో మాట్లాడిన ప్రకారం.. కాంగ్రెస్‌కు అదానీ, అంబానీలు టెంపోల నిండుగా డబ్బు పంపుతుంటే.. ఈడీ, సీబీఐ, ఐటీ ఎందుకు మౌనంగా ఉన్నాయని నిలదీశారు. 

ప్రజలు ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని కేటీఆర్ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలున్నాయని ఆరోపించారు. ప్రజలు ఇన్వర్టర్లు, ఛార్జింగ్ లైట్లు, టార్చ్ లైట్లు, క్యాండిళ్లు, జనరేటర్లు, పవర్ బ్యాంకులు అనే ఆరు గ్యారంటీలను సిద్ధంగా ఉంచుకోవాలంటూ సర్కారు పనితీరును ఎద్దేవా చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img