icon icon icon
icon icon icon

నంద్యాల

కర్నూలు జిల్లా నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం (Nandyal Lok Sabha constituency) 1952లో ఏర్పడింది.

Updated : 28 Apr 2024 19:10 IST

లోక్‌సభ నియోజకవర్గం

నంద్యాల తొలి నుంచి జనరల్‌కు రిజర్వ్‌ చేయబడి ఉంది. నియోజకవర్గాల పునర్వవ్యవస్థీకరణకు ముందు ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు అసెంబ్లీ శాసనసభా స్థానం ఈ నియోజకవర్గం పరిధిలో ఉండేది. అనంతరం దాన్ని ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంలో కలిపారు.

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు (ఎస్సీ), పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, డోన్‌ నియోజకవర్గాలు ఉన్నాయి.

ఓటర్లు: తాజా గణాంకాల ప్రకారం మొత్తం 16,97,696 ఓటర్లు ఉండగా, పురుషులు 8,33,589 మంది, మహిళలు 8,63,770 మంది.. ట్రాన్స్‌ జెండర్లు 337 మంది ఓటర్లు ఉన్నారు.

2019 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి శివానందరెడ్డిపై  వైకాపా అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి ఘన విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో వైకాపా నుంచి మరోసారి పోచా బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తుండగా, తెదేపా నుంచి బైరెడ్డి శబరి బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ పార్టీ జంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్‌ను పోటీలో నిలిపింది.

  • నంద్యాలో లోక్‌సభ నుంచి గెలుపొందిన వారి వివరాలు
  • 1952: రాయసం శేషగిరిరావు (కాంగ్రెస్‌)
  • 1967: పెండేకంటి వెంకటసుబ్బయ్య(కాంగ్రెస్)
  • 1971: పెండేకంటి వెంకటసుబ్బయ్య(కాంగ్రెస్)
  • 1977: నీలం సంజీవరెడ్డి జనతాపార్టీ
  • 1980: పెండేకంటి వెంకటసుబ్బయ్య కాంగ్రెస్ (ఐ)
  • 1984: మద్దూరు సుబ్బారెడ్డి (తెదేపా)
  • 1989: బొజ్జా వెంకటరెడ్డి (కాంగ్రెస్)
  • 1991: గంగుల ప్రతాపరెడ్డి (కాంగ్రెస్)
  • 1996: పీవీ నరసింహరావు (కాంగ్రెస్)
  • 1996: (ఉప ఎన్నిక) భూమానాగిరెడ్డి (తెదేపా)
  • 1998: భూమా నాగిరెడ్డి (తెదేపా)
  • 1999: భూమానాగిరెడ్డి (తెదేపా)
  • 2004: ఎస్పీవై.రెడ్డి (కాంగ్రెస్)
  • 2009: ఎస్పీవై రెడ్డి (కాంగ్రెస్)
  • 2014: ఎస్పీవై రెడ్డి(వైకాపా)
  • 2019: బ్రహ్మానందరెడ్డి (వైకాపా)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img