icon icon icon
icon icon icon

నరసరావుపేట

నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గానికి (Narasaraopet Lok Sabha constituency) 1952లో తొలిసారి ఎన్నిక జరిగింది. ఇది జనరల్‌ కేటగిరి.

Updated : 28 Apr 2024 19:12 IST

లోక్‌సభ నియోజకవర్గం

నియోజకవర్గ పునర్విభజనకు ముందు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, దర్శి, కంభం, గుంటూరు జిల్లాలోని వినుకొండ, నరసరావుపేట, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాలు ఇందులో ఉండేవి. పునర్విభజన తర్వాత గుంటూరు జిల్లాకే పరిమితమైంది.

లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు: నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల, వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గాలు దీని పరిధిలో ఉన్నాయి.

ఓటర్లు: తాజా గణాంకాల ప్రకారం మొత్తం 17,14,127 ఓటర్లు ఉండగా, 8,38,451పురుషులు, 8,75,480 మహిళలు.. 196 ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు ఉన్నారు.

2019 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి రాయపాటి సాంబశివరావుపై వైకాపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు విజయం సాధించారు. ప్రస్తుతం వైకాపా నుంచి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పోటీ చేస్తుండగా, తెదేపా నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు బరిలో నిలిచారు. అలెగ్జాండర్‌ సుధాకర్‌ను కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది.

  • ఇప్పటివరకూ గెలుపొందిన అభ్యర్థులు వీరే!
  • 1952: సి.ఆర్.చౌదరి(స్వతంత్ర అభ్యర్ధి)
  • 1967: మద్ది సుదర్శనం(కాంగ్రెస్‌)
  • 1971: మద్ది సుదర్శనం(కాంగ్రెస్‌)
  • 1977: కాసు బ్రహ్మానందరెడ్డి(కాంగ్రెస్‌)
  • 1980: కాసు బ్రహ్మానందరెడ్డి(కాంగ్రెస్‌)
  • 1984: కాటూరి నారాయణ స్వామి(తెలుగుదేశం)
  • 1989: కాసు వెంకట కృష్ణారెడ్డి(కాంగ్రెస్‌)
  • 1991: కాసు వెంకట కృష్ణారెడ్డి(కాంగ్రెస్‌)
  • 1996: కోట సైదయ్య(తెలుగుదేశం)
  • 1998: కొణిజేటి రోశయ్య(కాంగ్రెస్‌)
  • 1999: నేదురుమల్లి జనార్ధనరెడ్డి(కాంగ్రెస్‌)
  • 2004: మేకపాటి రాజమోహన రెడ్డి(కాంగ్రెస్‌)
  • 2009: మోదుగుల వేణుగోపాలరెడ్డి(తెలుగుదేశం)
  • 2014: రాయపాటి సాంబశివరావు(తెలుగుదేశం)
  • 2019: లావు శ్రీకృష్ణదేవరాయలు (వైకాపా)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img