icon icon icon
icon icon icon

నరసాపురం

నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది జనరల్‌ కేటగిరి స్థానం.

Updated : 26 Apr 2024 13:46 IST

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: ఈ నియోజకవర్గంలో పరిధిలో (Narasapuram Lok Sabha constituency) ఏడు అసెంబ్లీ శాసనసభా స్థానాలు ఉన్నాయి. ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం అసెంబ్లీలు దీని కిందికి వస్తాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 8 సార్లు విజయం సాధించగా.. తెదేపా 4, భాజపా 2, వైకాపా, సీపీఐ చెరోసారి గెలుపొందాయి.

ఓటర్లు: 2024 ఓటర్ల జాబితా ప్రకారం.. నియోజకవర్గంలో మొత్తం 14.62 లక్షల మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 7.17 లక్షలు, మహిళలు 7.44 లక్షలు, ట్రాన్స్‌జెండర్లు 74 మంది ఉన్నారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి వి.వి. శివరామరాజుపై వైకాపా అభ్యర్థి రఘురామ కృష్ణరాజు 32,676 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే, ఆ తర్వాత పార్టీలో తనకు ఎదురైన పరిణామాల నేపథ్యంలో రఘురామ వైకాపాకు దూరంగా ఉంటూ వచ్చారు.

ప్రస్తుత ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా పొత్తులో భాగంగా నరసాపురం భాజపాకు వెళ్లింది. దీంతో ఆ పార్టీ భూపతిరాజు శ్రీనివాసవర్మను బరిలో దించింది. భాజపా నుంచి రఘురామ కృష్ణరాజు పేరు బలంగా వినిపించినా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్యంగా భాజపా సీనియర్‌ నేత వర్మ తెర మీదకు వచ్చారు. భీమవరానికి చెందిన శ్రీనివాసవర్మ ఎంతోకాలం నుంచి పార్టీలో ఉంటూ బీజేపీ వర్మగా గుర్తింపు పొందారు. పార్టీలో వివిధ స్థాయిల్లో ఆయన పనిచేశారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచారు. మరోవైపు వైకాపా అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన గూడూరి ఉమాబాల పోటీ చేస్తున్నారు. ఆమె న్యాయవాది. 1995 నుంచి ఆమె క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. ఉమాబాల తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండటం గమనార్హం. ఇక కాంగ్రెస్‌ నుంచి కొర్లపాటి బ్రహ్మానందనాయుడు బరిలో నిలిచారు

  • ఇప్పటివరకూ గెలుపొందిన అభ్యర్థులు వీళ్లే!
  • 1957 - ఉద్దరాజు రామమ్‌ (సీపీఐ)
  • 1962 - దాట్ల. బలరామరాజు (కాంగ్రెస్‌)
  • 1967 - దాట్ల. బలరామరాజు (కాంగ్రెస్‌)
  • 1971 -  ఎం.టి.రాజు (కాంగ్రెస్‌)
  • 1977 - అల్లూరి. సుభాష్‌ చంద్రబోస్‌ (కాంగ్రెస్‌)(ఐ)
  • 1980 - అల్లూరి. సుభాష్‌ చంద్రబోస్‌ (కాంగ్రెస్‌)(ఐ)
  • 1984 - భూపతిరాజు. విజయ్‌కుమార్‌ రాజు (తెదేపా)
  • 1989 - భూపతిరాజు. విజయ్‌కుమార్‌ రాజు (తెదేపా)
  • 1991 - భూపతిరాజు. విజయ్‌కుమార్‌ రాజు (తెదేపా)
  • 1996 - కొత్తపల్లి. సుబ్బారాయుడు(తెదేపా)
  • 1998 - కనుమూరి బాపిరాజు (కాంగ్రెస్‌)
  • 1999 - కృష్ణం రాజు (భాజపా)
  • 2004 - చేగొండి. హరి రామ జోగయ్య (కాంగ్రెస్‌)
  • 2009 - కనుమూరి బాపిరాజు (కాంగ్రెస్‌)
  • 2014 - గోకరాజు గంగరాజు(భాజపా)
  • 2019 - రఘురామ కృష్ణరాజు (వైకాపా)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img