icon icon icon
icon icon icon

నెల్లూరు

నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం (Nellore Lok Sabha constituency) 1952లో ఏర్పాటైంది. 2009 ఎన్నికల నుంచి జనరల్‌ కేటగిరికి మార్చారు.

Updated : 28 Apr 2024 19:43 IST

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో కందుకూరు, కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్‌, ఉదయగిరి శాసనసభా నియోజకవర్గాలు ఉన్నాయి.

ఓటర్లు: తాజా గణాంకాల ప్రకారం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 16,79,359 ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 8,23,699.. మహిళలు 8,55,476.. ట్రాన్స్‌జెండర్లు 184 మంది ఉన్నారు.

2019 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి బీద మస్తాన్‌రావుపై వైకాపా అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం తెదేపా నుంచి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పోటీ చేస్తుండగా, వైకాపా నుంచి విజయసాయిరెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి కొప్పుల రాజు పోటీ చేస్తున్నారు.

  • నెల్లూరు లోక్‌సభ నుంచి గెలుపొందిన అభ్యర్థులు..
  • 1952: బెజవాడ రామచంద్రారెడ్డి (స్వతంత్ర)
  • 1957: బి.అంజనప్ప, ఆర్ఎల్ఎన్‌రెడ్డి (కాంగ్రెస్)
  • 1962: బి.అంజనప్ప (కాంగ్రెస్)
  • 1967: బి.అంజనప్ప (కాంగ్రెస్)
  • 1971: డి.కామాక్షయ్య (కాంగ్రెస్
  • 1977: డి.కామాక్షయ్య (కాంగ్రెస్)
  • 1980: డి.కామాక్షయ్య (కాంగ్రెస్)
  • 1983: పి.పెంచలయ్య (తెలుగుదేశం)
  • 1984: పి.పెంచలయ్య (తెలుగుదేశం)
  • 1989: పి.పెంచలయ్య ( కాంగ్రెస్)
  • 1991: కె.పద్మశ్రీ (కాంగ్రెస్)
  • 1996: పనబాక లక్ష్మి (కాంగ్రెస్)
  • 1997: పనబాక లక్ష్మి (కాంగ్రెస్)
  • 1999: ఉక్కాల రాజేశ్వరమ్మ (తెలుగుదేశం)
  • 2004: పనబాక లక్ష్మి (కాంగ్రెస్)
  • 2009: మేకపాటి రాజమోహన్‌రెడ్డి (కాంగ్రెస్)
  • 2014: మేకపాటి రాజమోహన్‌రెడ్డి(వైకాపా)
  • 2019: ఆదాల ప్రభాకర్‌రెడ్డి (వైకాపా)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img