icon icon icon
icon icon icon

Lok Sabha Elections: ఓటరే రాజు.. ఓటరే రాణి: ఆకట్టుకుంటోన్న రాయల్ పోలింగ్ బూత్

Lok Sabha Elections: ప్రజాస్వామ్య పండగలో భారీ సంఖ్యలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద చేసిన ఏర్పాట్లు ఆకట్టుకుంటున్నాయి. 

Published : 07 May 2024 12:23 IST

షిమోగా: సార్వత్రిక సమరం వేళ.. ఓటర్లను భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ఎన్నికల సంఘం, స్థానిక యంత్రాంగాలు వినూత్న ఆలోచనలు చేస్తుంటాయి. దానిలో భాగంగా కర్ణాటకలోని షిమోగా జిల్లా పంచాయతీలో ఒక కేంద్రం వద్ద ఓటర్ల కోసం రాచరికం ఉట్టిపడే ఏర్పాట్లు చేశారు.

ప్రజలే ప్రభువులు అనే ప్రజాస్వామ్య ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తూ.. ఓటేసిన వారికోసం సింహాసనాలు, కిరీటాలు అందుబాటులో ఉంచారని జాతీయ మీడియా కథనం పేర్కొంది. దీనిపై ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది. తమ ఓటు హక్కును వినియోగించిన తర్వాత కిరీటాలు ధరించి, సింహాసనంపై ఆసీనులై ఫొటోలకు పోజులిస్తోన్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇవి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇదివరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌ కుమార్ మాట్లాడుతూ.. ఓటు ప్రాముఖ్యతను వెల్లడించారు. ఈ ఎన్నికల కోసం రెండు సంవత్సరాల నుంచి సన్నద్ధమవుతున్నామని చెప్పారు. అలాగే ప్రత్యేక అవసరాలున్న వ్యక్తులు, వృద్ధులు ఓటింగ్‌లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కర్ణాటకలోని 28 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 26న 14 స్థానాలకు ఓటింగ్ జరగ్గా.. మిగిలిన చోట్ల ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img