icon icon icon
icon icon icon

శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లాలోని ఏకైక లోక్‌సభ నియోజకవర్గం (Srikakulam Lok Sabha constituency) ఇది. 1952లో ఏర్పాటైన ఈ స్థానం జనరల్‌ కేటగిరిలో ఉంది. 

Updated : 26 Apr 2024 12:45 IST

లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట నియోజకవర్గాలు దీని పరిధిలోకి వస్తాయి.

ఓటర్లు: 2024 ఓటర్ల జాబితా ప్రకారం.. ఈ నియోజకవర్గంలో మొత్తం 16.32 లక్షల ఓటర్లు ఉండగా.. పురుషులు 8.14 లక్షలు, మహిళలు 8.17 లక్షలు, ట్రాన్స్‌జెండర్లు 126 మంది ఉన్నారు.

1990 నుంచి ఈ నియోజకవర్గం తెదేపాకి కంచుకోటగా మారింది. దివంగత ఎర్రన్నాయుడు ఇక్కడి నుంచి 5 సార్లు పోటీ చేసి.. వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు. 2009లో తొలిసారి ఓటమి పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత జరిగిన 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో రామ్మోహన్‌నాయుడు ఈ స్థానం నుంచి గెలుపొందారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై.. తెదేపాకి చెందిన కింజరాపు రామ్మోహన్‌ నాయుడు 6,653 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. రామ్మోహన్‌ నాయుడు 47.23 శాతం ఓట్లు రాబట్టుకోగా.. దువ్వాడ శ్రీనివాస్‌కు 46.64శాతం ఓట్లు వచ్చాయి.

ప్రస్తుత ఎన్నికల్లో కింజరాపు రామ్మోహన్‌నాయుడు మరోసారి తెదేపా నుంచి పోటీ చేస్తూ హ్యాట్రిక్‌పై దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో వైకాపా నుంచి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్‌ను ఈసారి టెక్కలి శాసనసభ నియోజకవర్గం నుంచి బరిలో దించగా, అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పేరాడ తిలక్‌ను ఇప్పుడు శ్రీకాకుళం ఎంపీగా పార్టీ బరిలో నిలబెట్టింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పేడాడ పరమేశ్వర్‌ పోటీలో ఉన్నారు.

  • ఇప్పటివరకూ గెలుపొందిన అభ్యర్థులు వీళ్లే!
  • 1952- బొడ్డేపల్లి రాజగోపాల రావు (మద్రాస్‌ స్టేట్‌)- స్వతంత్ర అభ్యర్థి
  • 1957 -బొడ్డేపల్లి రాజగోపాల రావు (కాంగ్రెస్‌)
  • 1962- బొడ్డేపల్లి రాజగోపాల రావు (కాంగ్రెస్‌)
  • 1967- ఎన్‌.జి. రంగా ( స్వతంత్ర పార్టీ)
  • 1971- బొడ్డేపల్లి రాజగోపాల రావు (కాంగ్రెస్‌)
  • 1977-బొడ్డేపల్లి రాజగోపాల రావు (కాంగ్రెస్‌)
  • 1980- అప్పయ్యదొర హనుమంతు (తెదేపా)
  • 1984- అప్పయ్యదొర హనుమంతు (తెదేపా)
  • 1989- విశ్వనాథం కణితి (కాంగ్రెస్‌)
  • 1991- విశ్వనాథం కణితి (కాంగ్రెస్‌)
  • 1996- ఎర్రన్నాయుడు కింజరాపు (తెదేపా)
  • 1998- ఎర్రన్నాయుడు కింజరాపు (తెదేపా)
  • 1999- ఎర్రన్నాయుడు కింజరాపు (తెదేపా)
  • 2004- ఎర్రన్నాయుడు కింజరాపు (తెదేపా)
  • 2009- కిల్లి కృపారాణి ( కాంగ్రెస్‌)
  • 2014- రామ్మోహన్‌ నాయుడు (తెదేపా)
  • 2019- రామ్మోహన్‌ నాయుడు (తెదేపా)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img