icon icon icon
icon icon icon

విశాఖపట్నం

విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇది జనరల్ కేటగిరిలో ఉంది.

Updated : 26 Apr 2024 12:39 IST

లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: విశాఖపట్నం జిల్లాలోని శృంగవరపుకోట, భీమిలి, విశాఖపట్నం తూర్పు, విశాఖపట్నం దక్షిణ, విశాఖపట్నం ఉత్తర, విశాఖపట్నం పశ్చిమ, గాజువాకతో కలిపి మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు దీని పరిధిలోకి వస్తాయి.

ఓటర్లు: 2024 ఓటర్ల జాబితా ప్రకారం.. నియోజకవర్గంలో మొత్తం 18.67 లక్షల మంది ఓటర్లు ఉండగా.. అందులో 9.22 లక్షల మంది పురుషులు, 9.45 లక్షల మంది మహిళలు, 111 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి భరత్‌ మతుకుమిల్లిపై వైకాపాకి చెందిన ఎం.వి.వి. సత్యనారాయణ 4,414 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. భరత్‌కు 34.89శాతం ఓట్లు రాగా.. సత్యనారాయణ 35.24శాతం ఓట్లు సాధించారు. ఈ లోక్‌సభ నియోజకవర్గానికి  (Visakhapatnam Lok Sabha constituency) ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికలు జరగ్గా.. అత్యధికంగా 11 సార్లు కాంగ్రెస్‌ విజయం సాధించింది. తెదేపా 3 సార్లు, భాజపా, వైకాపా చెరోసారి గెలుపొందాయి.

ప్రస్తుతం తెదేపా నుంచి మతుకుమిల్లి భరత్‌ మరోసారి పోటీ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. 29 సంవత్సరాలకే రాజకీయ రంగ ప్రవేశం చేసిన శ్రీభరత్‌ 2019 ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి కూటమిలోని కీలక నేతలందరి నుంచి శ్రీభరత్‌కు మద్దతు లభించడంతో పార్టీ కూడా ఆయన అభ్యర్థిత్వాన్నే ఖరారు చేసింది. గత ఎన్నికల్లో ఓటమి పాలైనా నిరాశ పడకుండా నిత్యం ప్రజల్లోనూ ఉంటూ ‘డైలాగ్‌ విత్‌ భరత్‌’ పేరుతో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. నగర సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు చొరవ చూపారు. మరోవైపు వైకాపా నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి అయిన బొత్స ఝాన్సీ ఎంపీగా బరిలో నిలిచారు. ఉన్నత విద్యావంతురాలైన ఝాన్సీ విజయనగరం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా, 2007 బొబ్బిలి ఎంపీగా, 2009లో విజయనగరం ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్‌ నుంచి సినీ నిర్మాత పులుసు సత్యనారాయణరెడ్డి (సత్యారెడ్డి) పోటీ చేస్తున్నారు.

  • ఇప్పటివరకూ గెలుపొందిన అభ్యర్థులు వీళ్లే!
  • 1952 - లంకా సుందరం (స్వతంత్ర అభ్యర్థి)
  • 1952 -  గామ్‌ మల్లుదొర ( స్వతంత్ర అభ్యర్థి)
  • 1957 - పూసపాటి విజయరామ గజపతిరాజు ( కాంగ్రెస్‌)
  • 1962 - మహారాజ్‌కుమార్‌ ఆప్‌ విజయనగరం ( కాంగ్రెస్‌)
  • 1967 - తెన్నేటి విశ్వనాధం (కాంగ్రెస్‌)
  • 1971 - పూసపాటి విజయరామ గజపతిరాజు (కాంగ్రెస్‌)
  • 1977 - ద్రోణంరాజు సత్యనారాయణ ( కాంగ్రెస్‌)
  • 1980 - అప్పలస్వామి కొమ్మూరు (కాంగ్రెస్‌)
  • 1984 - భట్టం శ్రీరామ మూర్తి (తెదేపా)
  • 1989 - ఉమా గజపతి రాజు (కాంగ్రెస్‌)
  • 1991 - ఎం.వి.వి.ఎస్‌. మూర్తి ( తెదేపా)
  • 1996 - టి. సుబ్బిరామిరెడ్డి ( కాంగ్రెస్‌)
  • 1998 - టి. సుబ్బిరామిరెడ్డి ( కాంగ్రెస్‌)
  • 1999 - ఎం.వి.వి.ఎస్‌. మూర్తి ( తెదేపా)
  • 2004 - ఎన్‌. జనార్ధన్‌రెడ్డి ( కాంగ్రెస్‌)
  • 2009 - దగ్గుబాటి. పురందేశ్వరి (కాంగ్రెస్‌)
  • 2014 - కంభంపాటి హరిబాబు ( భాజపా)
  • 2019 - ఎం.వి.వి. సత్యనారాయణ ( వైకాపా)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img