icon icon icon
icon icon icon

విజయనగరం

విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం 2008లో పునర్విభజన సమయంలో ఏర్పడింది.

Updated : 26 Apr 2024 12:42 IST

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు దీని కిందికి వస్తాయి. ఇది జనరల్‌ కేటగిరిలో ఉంది.

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎచ్చెర్ల, రాజాం (ఎస్సీ), బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాలు దీని పరిధిలోకి వస్తాయి.

ఓటర్లు: 2024 ఓటర్ల జాబితా ప్రకారం.. నియోజకవర్గంలో 15.68 లక్షల మంది ఓటర్లు ఉండగా.. 7.80 లక్షల మంది పురుషులు, 7.88 లక్షల మంది మహిళలు.. 92 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో (Vizianagaram Lok Sabha constituency) రికార్డు స్థాయిలో 80.98 శాతం పోలింగ్‌ నమోదైంది. తెదేపాకు చెందిన అశోక్‌ గజపతిరాజుపై వైకాపాకి చెందిన బెల్లాన చంద్రశేఖర్‌ 48,036 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ప్రస్తుతం తెదేపా నుంచి కలిశెట్టి అప్పలనాయుడు, వైకాపా నుంచి బెల్లాన చంద్రశేఖర్‌ పోటీలో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఎచ్చర్ల నుంచి పోటీ చేయాలని కలిశెట్టి ఆశించారు. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పొత్తులో భాగంగా ఎచ్చర్ల భాజపాకు వెళ్లిపోవడంతో కలిశెట్టికి విజయనగరం లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని తెదేపా కల్పించింది. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి బొబ్బిలి శ్రీను బరిలో నిలిచారు.

  • ఇప్పటి వరకు  గెలుపొందిన అభ్యర్థులు వీళ్లే!
  • 2009- బొత్స ఝాన్సీ లక్ష్మి (కాంగ్రెస్‌)
  • 2014- అశోక్‌ గజపతి రాజు (తెదేపా)
  • 2019 - బెల్లాన చంద్రశేఖర్‌  (వైకాపా)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img