Gannavaram: గన్నవరంలో 144 సెక్షన్‌.. తెదేపా నిరసనకు అనుమతి లేదు: ఎస్పీ జాషువా

గన్నవరంలోని తెదేపా కార్యాలయంపై వైకాపా దాడి ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా స్పందించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Updated : 21 Feb 2023 11:29 IST

విజయవాడ: గన్నవరంలోని తెదేపా కార్యాలయంపై వైకాపా దాడి ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా స్పందించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సోమవారం జరిగిన ఘటనల నేపథ్యంలో తెదేపా నిర్వహించతలపెట్టిన ‘చలో గన్నవరం’ కార్యక్రమానికి పోలీసుల అనుమతి లేదని చెప్పారు. విజయవాడలో మీడియాతో ఎస్పీ మాట్లాడారు.

సోమవారం గన్నవరం తెదేపా కార్యాలయం వద్ద జరిగిన ఘటనలో  విధులు నిర్వహిస్తున్న గన్నవరం సీఐ కనకరావు తలకు గాయమైందని ఎస్పీ చెప్పారు. తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగిందన్నారు. తెదేపా కార్యాలయంపై దాడి దృశ్యాలను పరిశీలిస్తున్నామని.. దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ చెప్పారు. గన్నవరం పీఎస్‌ పరిధిలో 144 సెక్షన్‌ విధించినట్లు వివరించారు. ముందస్తు అనుమతి లేకుండా సభలు, నిరసన కార్యక్రమాలలు చేపట్టొద్దని ఆయన కోరారు. 

పట్టాభి ఇంటికి పోలీసులు.. భర్తతో వీడియో కాల్‌ మాట్లాడించాలని కోరిన భార్య

మరోవైపు విజయవాడలోని పట్టాభి ఇంటికి పోలీసులు వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత గన్నవరం కోర్టుకు ఆయన్ను తీసుకొస్తామని పట్టాభి సతీమణి చందనకి చెప్పారు. పట్టాభితో వీడియో కాల్‌ మాట్లాడించాలని ఆమె కోరగా.. అందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో డీజీపీని కలిసేందుకు చందన బయల్దేరారు. అయితే బైక్‌పై బయల్దేరిన ఆమెను పోలీసులు అడ్డుకుని తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని