EYE Sight: కంటి చూపును కాపాడుకోండిలా!

‘సర్వేంద్రియానం నయనం ప్రధానం’అన్నారు పెద్దలు. అందుకే కంటి గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Published : 16 May 2022 02:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సర్వేంద్రియానం నయనం ప్రధానం’ అన్నారు పెద్దలు. అందుకే కంటి గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల కంటికి అనేక చిక్కులు వస్తున్నాయి. ఈ నాలుగు చిట్కాలు పాటిస్తే మీ కంటి చూపును కాపాడుకున్న వారవుతారు. అవేంటో చూద్దాం రండి!

సమతుల్యమైన ఆహారం: తీసుకొనే ఆహారంలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ ఎ, సి ఉండేటట్లు చూసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి. ఒమేగా-3 ఉండే చేపలను తీసుకోవాలి. ఇవి కంటి చూపు మెరుగు పడేందుకు దోహదపడతాయి.

మంచి నిద్ర: ప్రశాంతంగా నిద్రపోవడం ద్వారా కళ్లకు కావాల్సిన విశ్రాంతి లభిస్తుంది. కళ్లకు మాత్రమే కాదు మంచిగా నిద్ర పోతే రోగ నిరోధక శక్తి కూడా మెరుగు పడుతుంది. అందుకే హాయిగా పడుకోండి!

సన్‌ గ్లాసెస్‌ తప్పనిసరి: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రతిసారీ కూలింగ్‌ గ్లాసెస్‌ తప్పనిసరిగా ధరించాలి. ఇవి సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి కళ్లకు రక్షణనిస్తాయి.

పదే పదే కళ్లను చేతితో తాకకండి: రోజు మనం ఎన్నో పనులు చేస్తుంటాం. ఎన్నింటినో తాకుతుంటాం. అదే చేతితో కళ్లను తాకకూడదు. అలా చేస్తే బాక్టీరియా కళ్లలోకి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని