TTD: తితిదేకు చెందిన రూ.5వేల కోట్లు దారి మళ్లించారు: కూటమి నేతలు

తితిదే ఈవో ధర్మారెడ్డిని తొలగించాలని కోరుతూ కూటమి నేతలు ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనాకు ఫిర్యాదు చేశారు.

Updated : 09 Apr 2024 06:41 IST

తిరుపతి: తితిదే ఈవో ధర్మారెడ్డిని తొలగించాలని కోరుతూ కూటమి నేతలు ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనాకు ఫిర్యాదు చేశారు. తిరుమల, తిరుపతిలో రాజకీయ ప్రచారం, అక్రమాలను తెదేపా, జనసేన, భాజపా నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ధర్మారెడ్డి వల్లే తితిదే గౌరవ ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయని భాజపా నేత భాను ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. తితిదేకు చెందిన రూ.5వేల కోట్ల నిధులను దారి మళ్లించారని విమర్శించారు. బోర్డు నిర్ణయాలు ఆన్‌లైన్‌లో ఎందుకు పెట్టడం లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. వైకాపా నేతలకు దర్శన కోటా ఎలా లభిస్తోందని ప్రశ్నించారు. కరుణాకర్‌ రెడ్డి తన అనుచరులకు రూ.1,500 కోట్లు విడుదల చేశారని, ఆధారాలన్నీ సీఈవో మీనాకు సమర్పించామని ఆయన మీడియాకు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని