చిన్నారి పియానో వాయిస్తుండగా శస్త్రచికిత్స!

మెదడులో కణితితో బాధపడుతున్న తొమ్మిదేళ్ల చిన్నారికి వినూత్నరీతిలో శస్త్రచికిత్స జరిగిన సంఘటనిది. ఓ వైపు కణితిని తొలగించటంలో వైద్యులు నిమగ్నమైతే మరోవైపు పియానో వాయించింది ఆ చిన్నారి. వివరాల్లోకి వెళితే....

Published : 13 Dec 2020 19:05 IST


ఇంటర్నెట్‌ డెస్క్‌ : మెదడులో కణితితో బాధపడుతున్న తొమ్మిదేళ్ల చిన్నారికి వినూత్నరీతిలో శస్త్రచికిత్స జరిగిన సంఘటనిది. ఓ వైపు కణితిని తొలగించటంలో వైద్యులు నిమగ్నమైతే మరోవైపు పియానో వాయించింది ఆ చిన్నారి. వివరాల్లోకి వెళితే.... మధ్యప్రదేశ్‌లోని మొరైనా జిల్లా బాన్‌మూర్‌కు చెందిన తొమ్మిదేళ్ల సౌమ్య మెదడుకు సంబంధించిన వ్యాధితో బిర్లా ఆసుపత్రిలో చేరింది. ఆమె మెదడులో కణితి ఉన్నట్లు అక్కడి వైద్యులు నిర్ధరించారు. శస్త్రచికిత్స నిర్వహించాలని నిర్ణయించారు. చికిత్స చేసే సమయంలో మూర్ఛపోకుండా ఉండేందుకు పియానో వాయించాలని బాలికకు సూచించారు. ఓవైపు ఆమె పియానో వాయిస్తుంటే మరోవైపు శస్త్రచికిత్స చేశారు. ఈ వినూత్న ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేశామని, ప్రస్తుతం సౌమ్య ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వివరించారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని