ఈసారి బాలాపూర్‌ గణనాథుడు ఇలా..

కరోనా విజృంభణతో  వినాయక చవితి వేడుకల్లో సందడి లేకుండా పోయింది. గతంలో వినాయక చవితి వస్తుందంటే చాలు.. ఎంతో హడావుడి, భక్తుల కోలాహలం........

Published : 23 Aug 2020 02:35 IST

బాలాపూర్‌: కరోనా విజృంభణతో  వినాయక చవితి వేడుకల్లో సందడి లేకుండా పోయింది. గతంలో వినాయకచవితి వస్తుందంటే చాలు.. ఎంతో హడావుడి, భక్తుల కోలాహలం ఉండేది. కానీ ఈసారి అలాంటి సందడి వాతావరణమే ఎక్కడా కనబడలేదు. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో ఖైరతాబాద్‌ మహాగణపతి తర్వాత బాలాపూర్‌ గణనాథుడే ప్రసిద్ధి. అక్కడ జరిగే వేలం పాటపైనే అందరి దృష్టి. కానీ ఈసారి కరోనా వల్ల లడ్డూ వేలం పాట నిర్వహించడంలేదని గణేశ్ ఉత్సవ సమితి స్పష్టం చేసింది. గతేడాది 21 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఈ ఏడాది ఆరు అడుగులకే పరిమితం చేశారు.

 ఎప్పటిలాగే ఈసారి కూడా 21 కిలోల లడ్డూను గణనాథుడికి నైవేద్యంగా పెట్టినప్పటికీ వేలం పాట నిర్వహించడంలేదని కమిటీ ఇప్పటికే స్పష్టంచేసింది. మరోవైపు, శనివారం సాయంత్రం 6గంటల తర్వాత మండపంలో గణనాథుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బడంగ్‌పేట మేయర్‌ చిగురింత పారిజాత, ఉత్సవ సమితి అధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి పాల్గొన్నారు. పూజ అనంతరం మంత్రికి స్వామి వారి ప్రసాదం లడ్డూను అందజేశారు. బయటివారికి ప్రవేశం లేకపోడంతో ఈసారి సందడిలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని