
డ్యాన్స్ ఇరగదీసిన రోబో.. వీడియో వైరల్!
ఇంటర్నెట్ డెస్క్: మీకు చిట్టి గురించి తెలుసా.. అదేనండి రజనీకాంత్ నటించిన రోబో సినిమాలో చిట్టి. ఆ సినిమాలో రోబో ఫైట్లు చేయడం, డ్యాన్స్ వేయడం చూసే ఉంటారు. కానీ అదంతా సినిమా వరకే.. కానీ అచ్చం మనిషిలాగే డ్యాన్స్ చేసే రోబోను ఎప్పుడైనా చూశారా.. అయితే ఈ వీడియో చూడండి.. బోస్టన్ డైనమిక్స్ కంపెనీ తయారు చేసిన ఈ రోబోలు ‘డు యూ లవ్ మీ’అనే పాటకు స్టెప్పులేస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాయి.
2021 రాకను వేడుకగా జరుపుకొనేందుకు బోస్టన్ కంపెనీ ఇటీవల కొన్ని రోబోలను తయారు చేసింది. వీటికి కొంతవరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది. అందువల్ల పాటలకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ఆశ్చర్యపరిచాయి. దీన్ని అమెరికన్ ఇంజినీరింగ్, రోబోటిక్స్ డిజైన్ సంస్థ సరదాగా వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పంచుకుంది. రెండు నిమిషాల 19 సెకన్లు ఉన్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పైగా ‘కొంత సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’అనే కామెంట్ జత చేసింది. ఈ రోబో డ్యాన్స్‌ను పోస్టు చేసిన క్షణాల్లోనే 1.1 మిలియన్ మంది వీక్షించారు. వేల సంఖ్యలో కామెంట్లు లభించాయి. బోస్టన్ కంపెనీ ఇటీవల ఓ కుక్క రోబోను కూడా తయారు చేసిన విషయం తెలిసిందే.