ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయండి: జగన్‌

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తి చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో...

Published : 17 Sep 2020 01:33 IST

అమరావతి: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తి చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. పోలవరం, ఉత్తరాంధ్రతోపాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టు పనుల పురోగతిపై చర్చించారు. వృథాగా పోతున్న వరద జలాలను ఒడిసిపట్టాలని సీఎం జగన్‌ సూచించారు. చిత్రావతి, గండికోట ప్రాజెక్టుల్లో నీరు నింపాలన్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో 10 టీఎంసీలు.. గండికోటలో కనీసం 23 టీఎంసీలు నిల్వచేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలు అమలు చేయాలన్నారు. ఎక్కడా రైతులను ఇబ్బంది పెట్టే చర్యలు చేయొద్దని.. వారిపట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జగన్‌ సూచించారు.
 
పోలవరం హెడ్‌ వర్క్స్‌, కాల్వల పనులు 71 శాతం పూర్తయ్యాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ చివరి నాటికి మొత్తం 48 గేట్లు బిగిస్తామని తెలిపారు. కొవిడ్‌ సోకి కొంతమంది రాకపోవడంతో పనుల్లో కాస్త జాప్యం జరిగిందన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ అందుబాటులో ఉన్న అధికారులు, సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని ఆదేశించారు. డ్యామ్‌లకు అవసరమైన మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ సిబ్బంది నియామకానికి ఆయన అనుమతిచ్చారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని