బెంగాల్‌ దుర్గా ఉత్సవాల నిబంధనల్లో సడలింపు!

పశ్చిమబెంగాల్‌ ప్రజలకు అత్యంత ముఖ్యమైన దుర్గా వేడుకల ప్రారంభానికి ఒకరోజు ముందు కోల్‌కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దుర్గా పూజ మండపాలపై తీసుకున్న ‘నో ఎంట్రీ జోన్‌’ ఆదేశాలను కాస్త సడలింపులు చేస్తూ మంగళవారం తాజా నిర్ణయం తీసుకుంది.

Published : 21 Oct 2020 22:16 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ ప్రజలకు అత్యంత ముఖ్యమైన దుర్గా వేడుకల ప్రారంభానికి ఒకరోజు ముందు కోల్‌కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దుర్గా పూజ మండపాలపై తీసుకున్న ‘నో ఎంట్రీ జోన్‌’ ఆదేశాలను కాస్త సడలింపులు చేస్తూ మంగళవారం తాజా నిర్ణయం తీసుకుంది. పెద్ద మండపాల వద్ద 45 మంది పూజలు నిర్వహించేందుకు అనుమతులు జారీ చేసింది. ‘నో ఎంట్రీ’ నిబంధనలు సడలించాలంటూ దుర్గామాత ఉత్సవాల ఫోరం సభ్యులు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువరించింది. ‘పెద్ద మండపాల వద్ద 45 మంది, చిన్న మండపాల వద్ద 15 మందిని ఏకకాలంలో అనుమతించాలి. లోపలికి అనుమతించే వ్యక్తుల జాబితాను ప్రతిరోజూ ఉదయం 8గంటలకు మండపం బయట ప్రచురించాలి. 300 చదరపు గజాల పరిధిలో ఉన్న పెద్ద మండపాల వద్ద 60 మందితో  జాబితా చేయాలని.. అయినప్పటికీ ఒకేసారి 45 కంటే ఎక్కువ మందిని అనుమతించేది లేదు. మండపాల సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేయాలి’ అని కోర్టు స్పష్టం చేసింది.

కరోనా మహమ్మారి కారణంగా..పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూజ మండపాలను సందర్శకులకు నో ఎంట్రీ జోన్‌లుగా మార్చాలని కోల్‌కతా హైకోర్టు సోమవారం ఆదేశించిన విషయం తెలిసిందే. అన్ని మండపాల ప్రవేశ ద్వారం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. సాధారణంగా బెంగాల్‌లో దుర్గాపూజ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. మూడు రోజులలో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది పరిస్థితుల ప్రభావం కారణంగా ఆంక్షలు విధిస్తే మంచిదని హైకోర్టు సోమవారం పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని